ఈమధ్య కాలం లో హీరోల రెమ్యూనరేషన్లు అమాంతం పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు కేవలం థియేట్రికల్ మరియు సాటిలైట్ రైట్స్ మాత్రం ఉండేవి. కానీ ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత థియేట్రికల్ బిజినెస్ కంటే ఎక్కువగా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది. అందుకే నిన్న గాక మొన్న వచ్చిన చిన్న హీరోలు కూడా నిర్మాతలను భారీ స్థాయిలో రెమ్యూనరేషన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక కాస్త మీడియం రేంజ్ ఉన్న హీరోలు అయితే టాప్ స్టార్స్ రేంజ్ రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నారు.
వారిలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఒకడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి, చిన్న చిన్న పాత్రల ద్వారా హీరో అవకాశాలను సంపాదించి , ‘పెళ్లి చూపులు’ చిత్రం తో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని, ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తో యూత్ ఐకాన్ గా మారిపోయాడు. ఇక గీత గోవిందం సినిమాతో స్టార్ హీరో రేంజ్ వసూళ్లను రాబట్టిన విజయ్ దేవర కొండా మీడియం రేంజ్ హీరోలలో నెంబర్ 1 గా నిలిచాడు.
ఆయన హీరోగా నటించిన ‘లైగర్ ‘ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది, ఆ సినిమా హిట్ అయ్యుంటే కచ్చితంగా విజయ్ దేవరకొండ స్టార్ హీరోల లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చేవాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రానికి ఏకంగా 35 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. మూడేళ్ళ క్రితం (Ram Charan) రామ్ చరణ్, ఎన్టీఆర్. ఆర్. ఆర్. ఆర్ చిత్రానికి ఇంతకంటే తక్కువ రెమ్యూనరేషన్స్ తీసుకున్నారు.
కేర్ ఆఫ్ అడ్రస్ లేని విజయ్ దేవరకొండ ఇండస్ట్రీ కి వచ్చిన 5 ఏళ్లలోపే ఈ రేంజ్ కి ఎదిగాడంటే, ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ తగిలితే ఇక ఆయన ఏ రేంజ్ లో వేళ్తాడో ఊహించుకోవచ్చు, మరి ఆ రేంజ్ కి వేళ్తాడో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 1 వరకు ఆగాలి. ఎందుకంటే ఆయన హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం ఆరోజే విడుదల కాబోతుంది.
మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?