Vijay Devarakonda: చిరు, మహేష్ తరువాత ఇంటర్నేషనల్ యాడ్ లో విజయ్!

యూత్ లో వేగంగా తన క్రేజ్ పెంచుకుంటున్న హీరోలలో విజయ్ దేవరకొండ టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియాలో అయితే తన ఫాలోవర్స్ సంఖ్య కూడా అమాంతంగా పెరిగిపోతోంది. నార్త్ లో సైతం విజయ్ కు అభిమానులు పెరిగిపోతున్నారు. ఇక అతనికి ఇంటర్నేషనల్ యాడ్స్ చేసే అవకాశం కూడా లభిస్తోంది. ప్రముఖ కూల్ డ్రింక్ బ్రాండ్ థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ కొత్త డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, మహేష్ వంటి అగ్ర హీరోలు ఆ ప్రముఖ బ్రాండింగ్ ప్రమోషన్ బాధ్యతను తీసుకోగా ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా సెలెక్ట్ అవ్వడం విశేషం. ఇక మొదట యాడ్ లో ఈ రౌడి స్టార్ హాలీవుడ్ రేంజ్ లో స్టంట్స్ చేసి ఆశ్చర్యపరిచారు. ‘సాఫ్ట్ డ్రింక్ కాదు, ఇది తూఫాన్’ ఆంటీ బాటిల్‌ని పట్టుకుని విజయ్ దేవరకొండ కనిపించిన పోస్టర్‌తో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.

సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ వంటి బాలీవుడ్ స్టార్స్ అనంతరం తెలుగు నుంచి మహేష్ బాబుతో ఆ సంస్థ భారీ స్థాయిలో యాడ్స్ ను షూట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండతో హై వోల్టేజ్ యాడ్స్ ను డిజైన్ చేశారు. చూస్తుంటే ఈ యాడ్ సోషల్ మీడియాలో ఈజీగా ట్రెండ్ అయ్యేలా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరపైకి రానున్న ఆ సినిమాలో వరల్డ్ లెజెండ్ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక ప్రొఫెషినల్ బాక్సర్ గా కనిపించనున్న విజయ్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో ఆకట్టుకోబోతున్నట్లు సమాచారం. ఇక సుకుమార్ తో కూడా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus