కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో విజయ్ ఒకరు. విజయ్ ను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. విజయ్ ప్రస్తుతం లియో సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడంతో బిజినెస్ ఊహించని స్థాయిలో జరుగుతుండటం గమనార్హం.
ఈ స్టార్ హీరో కోసం అభిమానులు 10,000 వాట్సాప్ గ్రూప్ లను సిద్ధం చేస్తున్నారని సమాచారం. విజయ్ తన సేవా కార్యక్రమాల ద్వారా అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతూ ఉండటం గమనార్హం. సేవా కార్యక్రమాలు ప్రజలకు మంచి పేరును తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే 1600 గ్రూపులు ఉండగా ఆ సంఖ్యను మరింత పెంచే దిశగా అడుగులు పడుతుండటం గమనార్హం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయ్ తన పార్టీ ద్వారా కొంతమంది అభ్యర్థులతో పోటీ చేయించనున్నారని తెలుస్తోంది.
విజయ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలకు విజయ్ ప్రాధాన్యత ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో విజయ్ కు మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విజయ్ ఇతర భాషల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.
పండుగల సమయంలో తన సినిమాలు విడుదలయ్యేలా (Thalapathy Vijay) విజయ్ ప్లాన్ చేసుకుంటున్నారు. విజయ్ తన రాజకీయాలను తమిళనాడుకే పరిమితం చేస్తారో లేక ఇతర ప్రాంతాలపై దృష్టి పెడతారో తెలియాల్సి ఉంది. సినిమాల్లో సంచలనాలు సృష్టించిన విజయ్ రాజకీయాల్లో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!