సినిమా విజయం సాధిస్తే హీరో విజయం, సినిమా పరాజయం పాలైతే అది దర్శకుడి తప్పు అనుకునేవారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. దురదృష్టం ఏంటంటే… అలాంటి వారిలో సినిమా ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగినవాళ్లు కూడా ఉన్నారు. తాజాగా అలాంటి వ్యక్తి ఒకరు బయటికొచ్చారు. ఆయనే విజయ్ తండ్రి చంద్రశేఖర్. ఆయన ఓ దర్శకుడు అనే విషయం కూడా తెలిసిందే. ‘బీస్ట్’ సినిమా ఫలితంపై ఆయన ఇటీవల మాట్లాడారు. ఈ క్రమంలో ఆ సినిమా దర్శకుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయ్ నటించిన ‘బీస్ట్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకుడిగా ఈ సినిమా రూపొందింది. టెర్రరిజం నేపథ్యంలో సాగే కథాంశంతో పవర్‌ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నప్పటికీ… విజయ్ రేంజి విజయం అయితే కాదు అని అంటున్నారు ఫ్యాన్స్, పరిశీలకులు. సినిమాకు మిశ్రమ స్పందనలు రావడం కూడా తెలిసిందే. ఫైట్స్, సాంగ్స్, హీరోయిజం… ఇలా అన్నీ బాగున్నప్పటికీ స్క్రీన్‌ప్లే విషయంలో నెల్సన్ ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే బాగుండేది అని విమర్శకులు అంటున్నారు.
‘‘ఇటీవల నేను ‘బీస్ట్’ చూశాను. ‘అరబిక్ కుత్తు…’ పాటను డైహార్డ్ ఫ్యాన్‌లా నేనూ ఎంజాయ్ చేశా. విజయ్ స్టార్ డమ్ కారణంగానే ‘బీస్ట్’ ఇంకా నడుస్తోంది. అంతేకానీ వేరే కారణాల వల్ల సినిమాకు ఈ విజయం దక్కలేదు’’ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా దర్శకుడి పనితనాన్ని విమర్శించారు చంద్రశేఖర్. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు, వాటి మిషన్స్ లాంటి సీరియస్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నప్పుడు స్క్రీన్‌ప్లేతో మేజిక్ క్రియేట్ చేయొచ్చు. ‘బీస్ట్’లో ఆ మేజిక్ మిస్ అయ్యింది అని చెప్పొచ్చు.
మిలటరీ వ్యవస్థ, ‘రా’ ఏజెంట్‌లు ఎలా వ్యవహరిస్తారు లాంటి వాటిపై నెల్సన్ ఇంకా బాగా వర్క్ చేయాల్సింది అని నెల్సన్ పనితనం గురించి మాట్లాడారు చంద్రశేఖర్. అయితే ‘బీస్ట్’ హిట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు అని కూడా చెప్పారాయన. సంగీత దర్శకుడు, ఫైట్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్, ఎడిటర్, హీరో.. వీళ్ల కారణంగానే ‘బీస్ట్’ విజయం సాధించింది అంటూ మిగిలిన వారిని విమర్శించారు చంద్రశేఖర్. ‘బీస్ట్’ విజయంలో అందరి పాత్ర ఉందని తెలిపిన చంద్రశేఖర్.. నెల్సన్ పేరుని సినిమా విజయంలో భాగం చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!