ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే.. ఎదుగుతున్న కొడుకుని చూసి తండ్రి తనంతటి వాడవుతాడంటూ గర్వపడతాడు అని అంటుంటారు.. కానీ తమిళ స్టార్, దళపతి విజయ్ మాత్రం తనను కన్న తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని.. తన ఫంక్షన్‌కి వచ్చిన అమ్మా నాన్నలను అవమానించాడంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.. సినిమాల్లో సందేశాలిచ్చే నిజ జీవితంలో వాటిని పాటించకపోతే ఎలా ? అంటూ ప్రశ్నిస్తున్నారు.. వివరాల్లోకి వెళ్తే.. విజయ్, రష్మిక జంటగా.. దిల్ రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘వరిసు’ తెలుగులో ‘వారసుడు’..
తమిళ్ వెర్షన్ ఆడియో ఫంక్షన్ జనవరి 2న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు విజయ్ ఫ్యాన్స్ కూడా భారీగా తరలి వచ్చారు.. అలాగే విజయ్ తండ్రి, ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.ఎ. చంద్ర శేఖర్, తల్లి శోభన కూడా వచ్చారు. విజయ్ స్టేడియంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కుడున్న అభిమానులకు అభివాదం చేస్తూ.. సిబ్బందిని.. గెస్టులను పలకరించాడు.. ఆ క్రమంలోనే తల్లిదండ్రుల దగ్గరకు కూడా వచ్చి.. వారిని పలకరించి ముందుకు కదిలాడు..
అయితే, విజయ్ సొంత తల్లిదండ్రులనే పట్టించుకోవట్లేదని.. ఏదో మొక్కుబడిగా వారిని పలకరించారని వార్తలు వైరల్ అయ్యాయి.. తాజాగా ఈ వార్తలపై విజయ్ తల్లి శోభన స్పందించారు.. ఆమె మాట్లాడుతూ.. ‘‘ఆ ఫంక్షన్ ‘వరిసు’ సినిమా గురించి.. విజయ్ గురించి జరిగింది.. అంత పెద్ద కార్యక్రమంలో, అంత హడావిడిలో ఒక తల్లిగా నా కొడుకు దగ్గరినుండి ఏం ఆశిస్తాను చెప్పండి?’’ అన్నారు.. ఇదిలా ఉంటే.. విజయ్‌కి తండ్రితో విభేదాలున్నాయని కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి..
దీనికి కారణం.. చంద్ర శేఖర్ తన కుమారుడు విజయ్ పేరుతో ఓ రాజకీయ పార్టీ పెట్టారు.. అయితే, తండ్రి పెట్టి పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని విజయ్ అనౌన్స్ చేశాడు.. అప్పటినుంచే విజయ్‌కి కుటుంబంతో సంబంధాలు సన్నగిల్లాయని వార్తలు వస్తున్నాయి.. ఇప్పుడీ విషయం ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి..
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్