Vijay Sethupathi: షారుఖ్, బన్నీ సినిమాల్లో విజయ్ సేతుపతి..?

తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ కథలను ఎన్నుకుంటూ.. విభిన్న పాత్రల్లో నటిస్తూ వెర్సటైల్ యాక్టర్ గా ఫేమ్ తెచ్చుకున్నారు. ఆయనకు నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా రెడీగా ఉంటారు. హీరోగానే కాకుండా విలన్ గా కూడా పని సినిమాలు చేశారు. ‘ఉప్పెన’, ‘విక్రమ్’, ‘మాస్టర్’సినిమాలలో అతడిని విలన్ గా చూపించారు. ఈ సినిమాల్లో అతడి పాత్రలు పండడంతో దర్శకులు సైతం విజయ్ సేతుపతిని నెగెటివ్ వేషాల కోసమే సంప్రదిస్తున్నారు.

తాజాగా షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జవాన్’ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతిని ఎన్నుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దాదాపు విజయ్ ని ఫైనల్ చేసినట్లేనని చెబుతున్నారు. ఈ సినిమాలో విలన్ రోల్ చాలా క్రూరంగా ఉంటుందని టాక్. అలాంటి పాత్రకు విజయ్ సేతుపతి అయితేనే న్యాయం చేయగలరని భావిస్తున్నారు దర్శకుడు అట్లీ. షారుఖ్-అట్లీ లాంటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా కాబట్టి విజయ్ సేతుపతి నో చెప్పే ఛాన్స్ లేదు.

గతంలో ‘సైరా’ లాంటి సినిమాలో చిన్న రోల్ పోషించిన విజయ్ సేతుపతి ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమా ఆఫర్ ని వదులుకునే అవకాశమే ఉండదు. ఈ సినిమాతో పాటు ‘పుష్ప2’ సినిమాలో కూడా విజయ్ సేతుపతిని ఓ పాత్ర కోసం తీసుకోవాలనుకుంటున్నారు. ఇతడి కోసం దర్శకుడు సుకుమార్ స్పెషల్ ట్రాక్ ఒకటి రాసుకున్నారట. మొదటి భాగంలోనే విజయ్ సేతుపతిని విలన్ గా అనుకున్నప్పటికీ..

అతడి కాల్షీట్స్ దొరక్క సాధ్యం కాలేదు. కానీ ఈసారి ఎలాగైనా విజయ్ సేతుపతిని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోవాలనుకుంటున్నారు సుకుమార్. మొత్తానికి షారుఖ్-బన్నీ సినిమాలు పడితే గనుక విజయ్ సేతుపతికి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ రావడం ఖాయం!

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus