Vijay Sethupathi: తాగిన మైకంలో అలా చేశాడు.. స్టార్ హీరో కామెంట్స్!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై ఇటీవల ఎయిర్‌పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఓ ఆగంతకుడు ఈ దాడికి పాల్పడడం హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనకు సంబంధించి రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ విషయంపై విజయ్ సేతుపతి స్వయంగా స్పందించారు. నిజానికి ఇది చిన్న ఘటన అని.. దాడి జరగడానికి ముందే ఆ వ్యక్తి తన వ్యక్తిగత సిబ్బందితో గొడవపడ్డాడని చెప్పారు. ఆ సమయంలో అతను తాగిన మైకంలో ఉన్నాడని..

అందుకే మతిస్థిమితం కోల్పోయి ఆ విధంగా ప్రవర్తించాడని చెప్పారు. వీడియోలు వైరల్ కావడంతో జనాలు దీన్ని పెద్ద సమస్య చేస్తున్నారని.. అయినా ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫిల్మ్ మేకర్ అయిపోతున్నారని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఇదే సమయంలో వ్యక్తిగత సిబ్బందిని నియమించుకోవడంపై స్పందించారు సేతుపతి. తనకు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవడం అసలు నచ్చదని చెప్పారు. ఎప్పుడూ కూడా తన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తానని.. అతను తనకు ముప్పై ఏళ్లుగా తెలుసని చెప్పారు విజయ్ సేతుపతి.

ఇప్పుడు అతడే తనకు మ్యానేజర్ గా కూడా ఉన్నాడని చెప్పారు. అభిమానులను కలవడానికి, మాట్లాడడానికి తనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. ఈ ఘటన జరిగినంత మాత్రానా.. ఏమీ మారిపోననని.. ఇప్పుడు కూడా అభిమానులను కలుస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus