కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ఇతర భాషల్లో కూడా గుర్తింపును సంపాదించుకుని పాన్ ఇండియా నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సైరా నరసింహారెడ్డి, ఉప్పెన సినిమాలతో టాలీవుడ్ లో విజయ్ సేతుపతి పేరు మారుమ్రోగింది. పలువురు టాలీవుడ్ దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో విజయ్ సేతుపతిని నటింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే తమిళంలో మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ తో విజయ్ సేతుపతి బుల్లితెరపై కూడా సందడి చేయనున్నారు.
ఈ ప్రోగ్రామ్ ట్రైలర్ లాంఛ్ లో విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తనకు వంటలంటే చాలా ఇష్టమని లైఫ్ లో తాను ఎన్నో కష్టాలు పడ్డానని విజయ్ సేతుపతి తెలిపారు. కాలేజ్ లో చదువుకునే రోజుల్లో తాను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేసేవాడినని విజయ్ సేతుపతి అన్నారు. అక్కడే రాత్రి భోజనం కూడా చేసేవాడినని సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12.30 గంటల వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేశానని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.
డబ్బు కోసం, కుటుంబ సమస్యలు తీర్చడం కోసం చిన్నచిన్న పనులు చేసిన విజయ్ సేతుపతి తనకు ఉల్లి సమోసా అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉల్లి సమోసా దొరకడం లేదని తాను ఇంట్లో ప్రతిరోజు ఉల్లి సమోసా తిని టీ తాగుతానని విజయ్ సేతుపతి అన్నారు. ప్రోమో ద్వారా విజయ్ సేతుపతి మాస్టర్ చెఫ్ షోపై అంచనాలను భారీగా పెంచేశారని చెప్పాలి.