Vijay Sethupathi: ఎన్టీఆర్ నటనపై సేతుపతి ప్రశంసల వర్షం.. వాళ్లు సైలెంట్ అవుతారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గత ఆరేళ్లలో సోలో హీరోగా ఒక సినిమాలో మాత్రమే నటించారని విజయ్ సేతుపతి (Vijay Sethupathi) మాత్రం అదే సమయంలో 25 సినిమాల్లో నటించారని కొన్ని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ గత ఆరేళ్ల సినిమాలను లెక్కిస్తే ఆర్.ఆర్.ఆర్ (RRR) , దేవర (Devara) సినిమాలను కూడా లెక్కించాలి. అరవింద సమేత (Aravinda Sametha Veera Raghava) రిలీజ్ డేట్ నుంచి ఆరేళ్లు లెక్కిస్తే ఎన్టీఆర్ నటించిన మూడు సినిమాలు రిలీజైనట్టు అవుతుంది.

చాలామంది స్టార్ హీరోలు సైతం గత ఆరేళ్లలో మూడు సినిమాల కంటే ఎక్కువగా నటించలేదు. మరోవైపు విజయ్ సేతుపతి తారక్ యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రశంసల వర్షం కురిపించగా ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని విజయ్ సేతుపతి అన్నారు. మహారాజ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ సేతుపతి ఈ కామెంట్లు చేశారు.

తన ఫేవరెట్ హీరో, సౌత్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అని తారక్ అంటే నాకు చాలా అభిమానమని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ఒక సినిమాను కచ్చితంగా ఆశించవచ్చని కామెంట్లు వ్యక్తమయ్యాయి. విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ కూడా గత కొన్నేళ్లలో భారీగా పెరిగింది.

మహారాజ సినిమా సక్సెస్ తో విజయ్ సేతుపతి పేరు సౌత్ ఇండియా అంతటా మారు మ్రోగుతోంది. ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఇద్దరు విలన్స్ ఉంటారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ మీడియాకు దూరంగా ఉండటంతో వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus