‘ఫ్యామిలీ మ్యాన్‌’ టీమ్‌తో వీళ్లు కలుస్తున్నారా?

ఫిల్మ్‌ఫేర్‌ కొత్తగా లాంచ్‌ చేసిన ఓటీటీ అవార్డ్స్‌లో ‘ఫ్యామిలీ మ్యాన్‌’ భలేగా అవార్డులు సాధించింది. ఆ సిరీస్‌ దర్శకుడు రాజ్‌-డీకేకి మంచి ప్రశంసలే దక్కాయి. అదే జోరులో ఆ ఇద్దరూ మరో వెబ్‌ సిరీస్‌కు ప్లాన్‌ చేస్తున్నారట. అవును ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’. మాకెందుకు తెలియదు అంటారా. ఆగండాగండి… మీరు చెప్పింది కరెక్టే. ఆ తర్వాతి సిరీస్‌ గురించి మేం చెబుతున్నాం. అవును రాజ్‌-డీకే కొత్త వెబ్‌సిరీస్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ షూటింగ్‌ అయిపోవడంతో దీని గురించి సిద్ధం చేస్తున్నారట.

కొవిడ్‌ కారణంగానో, లేక ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్న కారణంగానో.. ఏదేతైనేం దేశంలో ఓటీటీల జోరు ఊపందుకుంది. దీంతో స్టార్ నటులు కూడా ఓటీటీలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ వరుసలోకి వచ్చేశారు. అంతేకాదు వీరిద్దరూ కలిసి ఆ వెబ్ సిరీస్ లో నటిస్తారట. సూపర్‌ కదా ఈ కాంబో. అంతేకాదు ఆ కాంబోను డైరెక్ట్‌ చేయబోయేది ‘ఫ్యామిలీ మ్యాన్‌’ టీమ్‌.

అమెజాన్ ప్రైమ్‌లోనే ప్రసారం కానున్న ఈ సిరీస్‌కు సంబంధించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు కొలిక్కి వచ్చాయట. ఓటీటీ బ్లాక్‌ బస్టర్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌ సిరీస్‌ సృష్టికర్తలు రాజ్ -డీకే ఈ వెబ్ సిరీస్‌ను హ్యాండిల్‌ చేస్తారట. మరేంటి తెలుగు దర్శకులు అన్నారు అనుకుంటున్నారా? రాజ్‌- డీకే తెలుగువాళ్లే కదా. రాజ్‌ నిడమోరు – కృష్ణ డీకే ఇక్కడివారే. తెలుగులో ఓ సినిమాకు నిర్మాతలుగా కూడా చేశారు. అదే సందీప్‌ కిషన్‌ నటించిన ‘డీ ఫర్‌ దోపిడి’. ఆ తర్వాత మళ్లీ తెలుగువైపు చూడలేదనుకోండి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus