ప్రముఖ సినీనటుడు డిఎండికె అధినేత విజయ్ కాంత్ నేడు ఉదయం శ్వాస విడిచిన సంగతి మనకు తెలిసిందే. ఈయన గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు ఉదయం కన్నుమూశారు. అయితే ఈయన కరోనా బారిన పడ్డారని వైద్యులు వెల్లడించారు. కరోనా కారణంగా ఇన్ఫెక్షన్ అధిక అవడంతో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా మారిందని తద్వారా వెండిలేటర్ పై ఉంచి చికిత్స అందించామని తెలిపారు.
ఇలా చికిత్స పొందుతూ విజయ్ కాంత్ మరణించడంతో ఈయనకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ కాంత్ సినీ నటుడుగా తన 1991 లో కెప్టెన్ ప్రభాకర్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సమయం నుంచి ఈయనకు కెప్టెన్ అనే బిరుదు వచ్చింది.
అప్పటినుంచి ఈయనను కెప్టెన్ అంటూ పిలిచేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొన్నటువంటి ఈయన మరణించడంతో ఈయన ఆస్తులకు సంబంధించినటువంటి వార్తలు అవుతున్నాయి. 2016 లో ఎన్నికల ఆఫిడవిట్ లో భాగంగా ఈయన స్థిర చరాస్తులు విలువలను పొందుపరిచారు. దీని ప్రకారం విజయ్ కాంత్ తన భార్య ప్రేమలత పేరు మీద ఉన్నటువంటి స్థిర చర ఆస్తులు విలువ మొత్తం కలిపి 38.77 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలియజేశారు.
అంతేకాకుండా వీరిద్దరి పేరు మీద 14.72 కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నట్లు (Vijayakanth) ఈయన ఎన్నికల ఆఫిడవిట్ లో వెల్లడించారు. అయితే ఇది 2016వ సంవత్సరంలో తెలియజేసిన ఆస్తుల విలువని, అయితే ఇప్పటికి ఈయన ఆస్తులు విలువ భారీగానే పెరిగి ఉంటుందని తెలుస్తోంది.