బయోపిక్ అంటే.. ఓ గొప్ప వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కే మూవీ అని అంతా అనుకుంటారు. నిజమే.. అయితే గొప్ప వ్యక్తి కదా.. అని అతనికి భజన చేస్తూ సినిమాగా తీస్తే ప్రేక్షకులను మెప్పించడం కష్టమవుతుంది.ఫలితం తేడా కొడుతుంది. ఇందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కాబట్టి.. ఆ గొప్ప వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన్న స్ట్రగుల్స్, హర్డిల్స్ ఏంటి.. వాటిని ఆయన ఎలా అధిగమించి సక్సెస్ సాధించాడు అనే ప్రయాణాన్ని చూపించాలి. అప్పుడే ఆ గొప్ప వ్యక్తి బయోపిక్ కు న్యాయం చేసినట్లు అవుతుంది. తాజాగా ‘విజయానంద్’ అనే మూవీ రిలీజ్ అయ్యింది.
ఇది కూడా బయోపిక్కే..!కర్ణాటకలో ‘వి.ఆర్.ఎల్ ట్రావెల్స్’ ను స్థాపించిన విజయ్ సంకేశ్వర్ జీవిత ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది. ఆయనతో పాటు ఆయన కొడుకు ఆనంద్ సంకేశ్వర్ పేరు కూడా కలుపుకుని ‘విజయానంద్ రోడ్ లైన్స్’ అనే కంపెనీని స్థాపించారు. అందుకే ఈ సినిమాకి ‘విజయానంద్’ అనే టైటిల్ ను పెట్టారు. సరే ఇంతకీ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :
కథ : విజయ్ సంకేశ్వర్ (హీరో నిహాల్) తన తండ్రి(అనంత్ నాగ్) నడిపే ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తూ ఉంటాడు. ఇతని ఆలోచనలు అన్నీ ఉన్నతంగా ఉంటాయి. ఆ ప్రెస్ లో కొత్త మిషన్ ను పెడితే ఇంకా ఎక్కువ లాభాలు పొందవచ్చు అని తన తండ్రికి సలహా ఇస్తాడు. అది సక్సెస్ అవుతుంది. లాభం 15 రెట్లు పెరుగుతుంది. అయితే పెళ్ళయ్యాక విజయ్ సంకేశ్వర్ ఆ ప్రెస్ నుండి బయటకు వచ్చి .. సొంతంగా ఓ లారీ కొనుక్కొని వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటాడు.
దీంతో అతని ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.అలాగే మార్కెట్ లో అతన్ని ఇబ్బంది పెట్టే యజమానులు చాలా మంది ఉంటారు. అయితే ఆ ప్రతికూల పరిస్థితులను అధిగమించి అతను వ్యాపారంలో నిలదొక్కుకుంటాడు.తర్వాత ఆ ప్రయాణం 5 వేల ట్రక్కుల వరకు వెళ్తుంది.45 ఏళ్లలోనే కర్ణాటకలో నెంబర్ 1 బిజినెస్మెన్ అవుతాడు. తర్వాత ఎం.పి అవుతాడు. అలాగే ఒక పత్రికను కూడా స్థాపించాల్సి వస్తోంది. అతని ప్రయాణంలో అతన్ని కిందికి లాగెయ్యాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో అతను కొడుకు ఏ విధంగా అండగా నిలబడ్డాడు అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : విజయ్ సంకేశ్వర్ గా నిహాల్ నటన ఆకట్టుకుంటుంది. ఈ పాత్ర కోసం అతను 22 కేజీలు పెరిగి మరీ నటించాడు అంటే అతని డెడికేషన్ ను అర్థం చేసుకోవచ్చు. అతని తర్వాత కె.జి.ఎఫ్ నటుడు అనంత్ నాగ్ పోషించిన తండ్రి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పాత్రకు ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్ లో అయితే కన్నీళ్లు పెట్టిస్తాడు.
పత్రిక యజమాని పాత్రలో నటించిన ప్రకాష్ బేలవాడి యాక్టింగ్ కూడా హైలెట్ అని చెప్పొచ్చు. ఇక విజయ్ సంకేశ్వర్ భార్య లలిత పాత్రలో సిరి ప్రహ్లాద్ కూడా చక్కగా నటించింది. విజయ్ సంకేశ్వర్ కొడుకు ఆనంద్ సంకేశ్వర్ పాత్రలో భరత్ కరెక్ట్ గా సూట్ అయ్యాడు. అతని లుక్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి అని చెప్పొచ్చు. బాగా నటించాడు కూడా..! మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు : మహిళా దర్శకురాలు రిషికా శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ బయోపిక్ కు కావాల్సిన ఇన్‌స్ప్రేషన్, మోటివేషన్,ఎమోషన్.. వంటివి ఈ కథలో ఉండేలా ఆమె చూసుకుంది. కాకపోతే కథనం మాత్రం నెమ్మదిగా సాగిన ఫీలింగ్.ఈ విషయంలో ఆమె ఇంకాస్త ఫోకస్ పెట్టుండాల్సింది. రన్ టైం 2 గంటల 39 నిమిషాల వరకు పెట్టాల్సిన అవసరం లేదు. సినిమాలో ప్రాముఖ్యత లేని సన్నివేశాలు చాలా ఉన్నాయి.
మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో..! అయితే ఫస్ట్ హాఫ్ వరకు ఆమె బాగానే అనిపిస్తుంది. సంగీత దర్శకుడు గోపి సుందర్ ఈ సినిమాకి మంచి ఔట్పుట్ ఇచ్చాడు. సినిమాకి మంచి నేపధ్య సంగీతం అందించాడు.అలాగే ‘ఆగి చూసే నా కన్నులే’ అనే పాట వినగానే ఎక్కేసే విధంగా ఉంది. ఆ పాటను పిక్చరైజ్ చేసిన విధానం కూడా బాగుంది. ఇక సినిమాలో సంభాషణలు కూడా చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తాయి.
‘కూర్చుని తింటూ ఉంటే ధనవంతుడు కూడా బిచ్చగాడితో సమానం’ ‘ సాధించకుండా ఛస్తే చావుకే అవమానం సిద్ధాంతాలు లేకుండా బ్రతికితే బ్రతుక్కే అవమానం’ ‘బియ్యం అక్షింతలు అవ్వాలన్నా నీళ్లు తీర్థం అవ్వాలన్నా దేవుని సన్నిధికి రాక తప్పదు’ వంటి డైలాగులు సినిమా చూసి బయటకు వెళ్తున్నప్పుడు కూడా వెంటాడతాయి. డైలాగ్ రైటర్ రఘు నిడువల్లి మంచి సంభాషణలు రాశాడు. నిర్మాణ విలువలు చాలా బగ్గున్నాయి.
విశ్లేషణ : బయోపిక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, స్లో పేస్ ను తట్టుకోగలిగే వాళ్ళు ‘విజయానంద్’ ను ట్రై చేయొచ్చు. ఎటువంటి అంచనాలు లేకుండా సినిమాకి వెళ్లే వీకెండ్ లవర్స్ ను ఈ మూవీ పెద్దగా డిజప్పాయింట్ చెయ్యదు.
రేటింగ్ : 1.5 /5
Rating
1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus