ఏడేళ్ల వయస్సులోనే బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి నటిగా, నిర్మాతగా రాజకీయ నాయకురాలిగా గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా విజయశాంతి నటించడం గమనార్హం. 180కు పైగా సినిమాలలో నటించిన విజయశాంతి ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా నటించడం లేదు. గతేడాది విజయశాంతి నటించి విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాలోని పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సౌత్ ఇండియాలో విజయశాంతిని లేడీ అమితాడ్ గా పిలుస్తారనే సంగతి తెలిసిందే.
లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటించిన విజయశాంతి ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకొని విజయశాంతి కొన్నేళ్ల క్రితం వార్తల్లో నిలిచారు. 1980 సంవత్సరంలో విజయశాంతి తన తొలి సినిమాకు 5,000 రూపాయలు పారితోషికంగా తీసుకున్నారని తెలుస్తోంది. 1999 సంవత్సరంలో రిలీజైన కర్తవ్యం సినిమాకు విజయశాంతి ఏకంగా కోటి రూపాయలు తీసుకున్నారు. ఆ స్థాయిలో భారత్ లో రెమ్యునరేషన్ తీసుకున్న తొలి మహిళా నటి విజయశాంతి కావడం గమనార్హం. 1998 సంవత్సరంలో విజయశాంతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
2000 సంవత్సరం నుంచి విజయశాంతి సినిమాల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు. పలువురు దర్శకులు విజయశాంతిని సంప్రదిస్తున్నా విజయశాంతి ఆ ఆఫర్లను సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో విజయశాంతి అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న సీనియర్ హీరోయిన్ల కొరత ఉన్న నేపథ్యంలో విజయశాంతి వరుసగా సినిమాలు చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.