విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో లియో మూవీ తెరకెక్కగా దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. విక్రమ్ తర్వాత లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజవుతున్న్ పోస్టర్లు ఈ మూవీపై అంచనాలను పెంచేశాయి. విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబో మూవీ లియో స్టోరీ లైన్ కు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో లియో ముంబైలో పెద్ద గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. డబ్బు కోసం లియో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అతనికి ఎదురైన సంఘటనలు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా అని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ తరహా కథాంశాలతో పదుల సంఖ్యలో తెరకెక్కాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
లియో (LEO Movie) సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాల నిడివితో తెరకెక్కిందని సమాచారం అందుతోంది. లియో సినిమా తెలుగు రైట్స్ రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు పోటీగా ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. దసరా కానుకగా థియేటర్లలో విడుదలవుతున్న సినిమాల బడ్జెట్ 400 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
దసరా కానుకగా విడుదలవుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. విజయ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.