హారర్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్న “మనం” దర్శకుడు
- April 28, 2016 / 07:38 AM ISTByFilmy Focus
“మనం” లాంటి అద్భుతమైన చిత్రం తర్వాత సూర్య హీరోగా “24” అనే సైన్స్ ఫిక్షన్ ను తెరకెక్కించిన విక్రమ్ కుమార్ తన తదుపరి చిత్రంగా అల్లు అర్జున్ తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా నవంబర్ లో ప్రారంభం కానుంది.
అల్లు అర్జున్ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ ఒక హారర్ థ్రిల్లర్ ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “13 B”కి సీక్వెల్ గా సదరు హారర్ థిల్లర్ రూపొందనుందని సమాచారం.
ఇకపోతే.. “24” మే 6న విడుదల కానుంది. సూర్య సరసన సమంత, నిత్యామీనన్ లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయం చేయడం విశేషం!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














