Balagam Movie: ఓ సినిమా కోసం ఊరు ఊరంతా ఒక్కటైంది… ఇదిగో రుజువు!

సినిమా ఎంతో బలమైంది.. ఈ మాట మీద మీకు ఏదైనా డౌట్‌ ఉంటే.. ఈ వార్త చదవండి మీకు అర్థమవుతుంది. ఓ సినిమా కోసం ఓ ఊరు ఊరంతా ఒక దగ్గరకు చేరింది అంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అది కూడా మన తెలుగు సినిమా కోసమే. పై ఫొటో చూశారుగా.. దాని గురించే ఇప్పుడు చెబుతున్నాం. వీళ్లంతా ఏ పంచాయతీకో, లేక ఏ కార్యక్రమం కోసమో ఒక దగ్గరకు చేరలేదు. వీళ్లంతా ఇక్కడకు వచ్చింది మేం పైన చెప్పిన సినిమా కోసమే. ఆ సినిమానే ‘బలగం’.

దిల్‌ రాజు నిర్మాణంలో కమెడియన్‌ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఆ సినిమా కోసమే వీళ్లంతా ఇలా ఓ చోటుకు చేరారు. కరీంనగర్ జిల్లా, గంగాధర మండలం, ఉప్పర మాల్యాల గ్రామంలో ఈ అపూర్వ ఘటన చోటు చేసుకుంది. అక్కడి ప్రజా ప్రతినిధి ఒకరు ‘బలగం’ సినిమాను చూపించడానికి ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ సమాచారం అందరికీ అందించారు. దీంతో ఊరు ఊరంతా అక్కడకు చేరుకుని ఇలా ఆనందాన్ని పంచారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు, వాళ్లంతా సినిమా చూస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమా కాబట్టి వాళ్లంతా ఆ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారని అంటున్నారు. ఇంతమంది సినిమా చూడటం కొత్తేం కాదు. అయితే ఒక ఊరు ఊరంతా ఇలా ఓ చోటు చేరడం మాత్రం విశేషమే అని చెప్పాలి. సినిమా ఎంతగా ప్రజలకు కనెక్ట్‌ అవుతుంది, దాని బలమెంత అనేది ఈ వైరల్‌ పోస్ట్‌ చెబుతుంది.

ఇక ఈ సినిమా (Balagam) విషయానికొస్తే.. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని సంతానం ఎలా కలిసింది? ఎప్పటినుండో వైరం ఉన్న వాళ్ల మధ్య సఖ్యత ఏర్పడటానికి ప్రకృతి ఎలా సహకరించింది? అనే అంశాల ఆధారంగా ‘బలగం’ సినిమా తెరకెక్కింది. అవార్డు సినిమా అవుతుంది అంటూ ముందు నుండి పేరు తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని ఇటీవల ఓటీటీలో విడుదల చేసినా థియేటర్లో కలెక్షన్లు తగ్గడం లేదు అంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus