సుకుమార్ ఇస్తున్న ట్విస్ట్ ఇదేనా..?!

బ్రిలియెంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే, చాలాకాలం నుంచి ఈ సినిమాలో విలన్ ఎవరు అనేది అఫీషియల్ గా మాత్రం తెలియడం లేదు. రీసంట్ గా పుష్పకి చెల్లిగా హీరోయిన్ మేఘా ఆకాష్ ఫిక్స్ అయ్యిందని వార్తలు వినిపించాయి. అడవి నేపథ్యంలో తీస్తున్న ఈ సినిమాకి పవర్ ఫుల్ విలన్ ని పెట్టాలని చూస్తున్నారట.

అయితే, ఇప్పుడు కేరళ ఎపిసోడ్స్ తీసేందుకు ఈ విలన్ ని కంపల్సరీగా ఫిక్స్ చేయాలని అంటున్నారు. అందుకోసం ఇప్పుడు విలన్ వేటలో పడిందట టీమ్. నిన్న మొన్నటిదాకా విలన్ రోల్ కి చాలాపేర్లు వినిపించాయి. తమిళ హీరో ఆర్య అని, శింబు అని ఇలా రకరకాలుగా అన్నారు. అంతేకాదు, ఉప్పెన తర్వాత విజయ్ సేతుపతినే మళ్లీ తీస్కుంటారని కూడా టాక్ వచ్చింది. కానీ, ఫిల్మీ ఫోకస్ కి ఎక్స్ క్లూజివ్ గా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప సినిమాలో సునీల్ ని విలన్ గా ఫిక్స్ చేసినట్లుగా సమాచారం.

మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే సునీల్ డేట్స్ ని సినిమా కోసం లాక్ చేశారని అంటున్నారు. ఈ సినిమాలో విలన్ గా సునీల్ కనిపిస్తారని అయితే, ఇది పుష్ప పక్కన ఉంటూనే విలన్ గా ఉంటాడా.. లేదా డైరెక్ట్ గా విలన్ రోల్ లోనే కనిపిస్తాడా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం హైదారబాద్ శివార్లలో పుష్పకోసం కొన్ని షాట్స్ తీస్తున్నట్లుగా సమాచారం. దీని తర్వాత సుకుమార్ అండ్ టీమ్ కేరళ షెడ్యూల్ ని ప్లాన్ చేసింది. అదీ విషయం

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus