‘వినరో భాగ్యము విష్ణు కథ’ 10 రోజుల కలెక్షన్ల వివరాలు

అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బ‌న్నీ వాసు నిర్మించిన ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు.టీజర్, ట్రైలర్ లు ప్రామిసింగ్ గా అనిపించాయి.సినిమా ఏ జోనర్ అనేది తెలియకుండా కన్ఫ్యూజ్ చేసి ఆసక్తిని రేకెత్తించాయి. దీంతో సినిమాపై అంచనాలు కూడా ఓ మాదిరిగా ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 18న శివరాత్రి కానుకగా చాలా గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ అయ్యింది.

పర్వాలేదు అనిపించే విధంగా టాక్ వచ్చింది.దీంతో ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి.వీక్ డేస్ లో డౌన్ అయినా స్టడీగానే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ ఇంకా కొన్ని ఏరియాల్లో బాగానే కలెక్ట్ చేస్తుంది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.04 cr
సీడెడ్ 0.76 cr
ఉత్తరాంధ్ర 0.39 cr
ఈస్ట్ 0.30 cr
వెస్ట్ 0.18 cr
గుంటూరు 0.21 cr
కృష్ణా 0.22 cr
నెల్లూరు 0.14 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.24 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.16 cr
ఓవర్సీస్ 0.31 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 4.71 cr (షేర్

‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రానికి రూ.4.21 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కొన్ని చోట్ల నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ రూ.4.71 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవరాల్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడంతో పాటు రూ.0.21 కోట్ల ప్రాఫిట్స్ ను కూడా బయ్యర్స్ కు అందించింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus