Viraj Ashwin: బేబీ సినిమా నటుడు విరాజ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘బేబీ’. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరో గా నటించిన చిన్న సినిమాగా విడుదలై సృష్టించిన సెన్సేషన్, ఈ ఏడాది విడుదలైన కొంతమంది స్టార్ హీరోలు కూడా సృష్టించలేకపోయారు. హృదయ కాలేయం , కొబ్బరి మట్ట మరియు కలర్ ఫోటో వంటి చిత్రాలను నిర్మించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాని చూసిన తర్వాత ఇతనిలో ఇంత టాలెంట్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇందులో ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య తర్వాత మంచి క్రేజ్ దక్కించుకున్న నటుడు విరాజ్ అశ్విన్. ఇతను కూడా చాలా చక్కగా నటించాడు, అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో విరాజ్ అశ్విన్ కి అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు కారణంగా ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ పడ్డాయి. దీని గురించి ఆయన మాట్లాడుతూ నేను ఇండస్ట్రీ కి రావాలని అనుకుంటున్న కొత్తల్లో ఒక డ్యాన్స్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చాను.

అది అల్లు అర్జున్ గారు ప్రాక్టీస్ చేసే షెడ్ కూడా. మా డ్యాన్స్ మాస్టర్ నాతో చెప్తూ ‘విరాజ్ ఇక్కడకి అల్లు అర్జున్ గారు వచ్చి ఎంతలా కష్టపడేవాడో తెలుసా?, ఉదయం 6 గంటలకు వచ్చి, సాయంత్రం 6 గంటల వరకు ప్రాక్టీస్ చేసేవాడు. ఒక స్టెప్పు పర్ఫెక్ట్ గా వచ్చే వరకు ఆయన ఇక్కడి నుండి కదిలేవాడు కాదు. బేబీ సక్సెస్ మీట్ అప్పుడు నేను అల్లు అర్జున్ గారికి ఈ విషయం చెప్పను, స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్లు ఊరికే అయిపోరు, ఆ స్థాయిలో హార్డ్ వర్క్ చెయ్యాలి అని చెప్పాను.

ఆ తర్వాత అల్లు అర్జున్ గారు స్పీచ్ ఇస్తున్న సమయం లో నాకు సమాధానం గా హార్డ్ వర్క్ చేస్తే మాత్రమే సరిపోదు, మనలో ఏ టాలెంట్ ఉందో ముందు గుర్తించాలి, దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టాలి, అప్పుడే సక్సెస్ అవుతాం అని చెప్పాడు. దీనికి సోషల్ మీడియా లో నెటిజెన్స్ యాక్షన్, రియాక్షన్ అని పెట్టి ట్రోల్ల్స్ చెయ్యడం మొదలు పెట్టారు, అల్లు అర్జున్ మాట్లాడిన ఆ ఒక్క మాట నన్ను ఇన్ని ట్రోల్ల్స్ ఎదురుకునేలా చేసింది అంటూ చెప్పుకొచ్చాడు (Viraj Ashwin) విరాజ్ అశ్విన్.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus