Chiranjeevi, Kamal, Salman: చిరు, కమల్‌, సల్మాన్‌ పిక్‌పై వైరల్‌ ట్వీట్‌… చూశారా!

కొన్ని ఫొటోలు వైరల్‌ అవ్వడానికి ఎంతో టైమ్‌ పట్టదు. అందులోని కంటెంట్‌ అంతలా వైరల్‌ అయ్యేలా చేస్తుంది. అలాంటి రెండు కలిస్తే ఇంకెంత వైరల్‌ అవ్వాలి. అలాంటి ఫొటో ఒకటి ఆదివారం సినిమాకు సంబంధించి సోషల్‌ మీడియా ఖాతాల్లో వైరల్‌ అయ్యింది. దీంతో ఫ్యాన్స్‌ అంతా వావ్‌ అనుకుంటూ తెగ రీట్వీట్‌లు, షేర్లు, చేశారు. అదే ఫొటో అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. ‘విక్రమ్‌’ సినిమా చూసి చిరంజీవి ఎంతో ఆనందంగా తన స్నేహితుడికి ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చిన ఫొటో.

ఇంకొకటి సూపర్‌ హిట్‌ సినిమా హిట్‌ కార్యక్రమం ఫొటో. హాలీడే టూర్‌కి వెళ్లి వచ్చిన తర్వాత చిరంజీవి కమల్‌ హాసన్‌ నటించిన ‘విక్రమ్‌’ చిత్రాన్ని వీక్షించారట. ఆ సినిమా ఎంతగానో నచ్చడం, బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టడంతో… మొత్తం చిత్రబృందాన్ని అభినందిస్తూ చిరంజీవి పార్టీ ఇచ్చారు. శనివారం రాత్రి జరిగిన ఈ పార్టీకి కమల్‌ హాసన్‌, దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌, యువ కథానాయకుడు నితిన్‌, తెలుగులో సినిమాను విడుదల చేసిన సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ వేడుకకు బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. సరిగ్గా అదే సమంలో చిరంజీవి సన్నిహితుల నుండి ఓ ఫొటో బయటకు వచ్చింది. సుమారు 36 ఏళ్ల క్రితం నాటి ఫొటో అది… అంటే 1986 నాటిది. ‘స్వాతిముత్యం’ సినిమా ఫంక్షన్‌లో క్లిక్‌మనిపించిన ఫొటో అది. అందులో కమల్‌, చిరంజీవితోపాటు అలనాటి ప్రముఖ నటుడు రాజ్‌ కపూర్‌ ఉన్నారు.

ఇప్పటి ఫొటోలో కమల్‌, చిరంజీవి పక్కన సల్మాన్‌ ఖాన్‌ ఉన్నారు. ఈ రెండు ఫొటోలకు దగ్గర పోలిక ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తొలి ఫొటో చిరంజీవి, కమల్‌ జూనియర్‌ హీరోలు అయితే, రెండో ఫొటోలో వీరిద్దరూ సీనియర్లు. సల్మాన్‌ వారికి జూనియర్‌. అదిరిపోయింది కదా ఫ్రేమ్‌. స్టార్స్‌ అంటే ఆ మాత్రం ఉండాలి కదా.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus