Samantha, Virat Kohli: ఆరోజు బాగా ఏడ్చేసాను… సమంత కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కోసం అవుతుంది.ఈ సినిమా విడుదలకు చాలా సమయం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత విజయ్ దేవరకొండ కలిసి స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇలా ఇంటర్వ్యూలో వీరిద్దరూ వారికి ఇష్టమైన స్పోర్ట్స్ అలాగే ప్లేయర్స్ వారి బ్యాగ్రౌండ్ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ క్రమంలోనే సమంత తనకు విరాట్ కోహ్లీ చాలా ఫేవరెట్ అని అలాగే విరాట్ తన ఇన్స్పిరేషన్ అని కూడా తెలియజేశారు.ఒకానొక సమయంలో విరాట్ కోహ్లీ ఫార్మ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయనపై ముప్పేట దాడి జరిగింది. అప్పుడు ఒక భారీ సెంచరీ చేసి కమ్ బ్యాక్ ప్రకటించారు.

ఆ చారిత్రాత్మక 71వ సెంచరీ నాకు ఎంతో స్పెషల్ ఆరోజు నేను కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చాననీ ఈ సందర్భంగా సమంత విరాట్ కోహ్లీ గురించి తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీతో పాటు ధోని అన్న కూడా తనకు చాలా ఇష్టమని తెలిపారు. ప్రస్తుతం ఐపీఎల్ లోచెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన ఫేవరెట్ అని ఈ సందర్భంగా (Samantha) సమంత స్పోర్ట్స్ గురించి ప్లేయర్స్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఖుషి సినిమా విషయానికి వస్తే ఈ సినిమా లవ్ ఎంటర్టైర్నర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాపై ఇటు విజయ్ దేవరకొండ సమంత ఇద్దరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ ఇద్దరికీ కూడా చాలా కీలకమని చెప్పాలి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus