శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ‘నీదీ నాదీ ఒకే కథ’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వేణు ఉడుగుల మొదటి చిత్రంతోనే డీసెంట్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో చిత్రానికి గాను ‘విరాట పర్వం’ అనే బరువైన కథాంశాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. నక్సల్స్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో ఒక టిపికల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇది ఓ యదార్థ సంఘటన ఆధారంగా తీసుకున్న ఓ పాయింట్.క్లైమాక్స్ లో ట్రాజెడీ ఎక్కువగా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే.
‘విరాట పర్వం’ ని దర్శకుడు వేణు తీర్చిదిద్దిన విధానం బాగుంది. అందుకు గాను అతనికి ప్రశంసలు దక్కాయి. కానీ ఆ మూవీ కమర్షియల్ సక్సెస్ మాత్రం అందుకోలేదు. ఇలాంటి సినిమాలు ఓటీటీలో చూడడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు.. కానీ, థియేటర్ లో చూడటానికి జనం ఇంట్రెస్ట్ చూపించరు అని తేలిపోయింది. ఈ విషయాన్ని కొంచెం తొందరగానే క్యాచ్ చేసిన వేణు.. తన నెక్స్ట్ సినిమాని కమర్షియల్ జోనర్ లో తెరకెక్కించాలి అని ఫిక్స్ అయ్యాడు.
తన నెక్స్ట్ మూవీని ఓ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తాడట. ప్రస్తుతం కథ పూర్తి చేసే పనిలో ఉన్నాడు వేణు. ”ఈసారి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నా. కథ సిద్ధమవుతోంది. హీరోతో పాటు మిగతా వివరాలు త్వరలో బయటికొస్తాయి. హీరో ప్రధానంగా సాగే కథ అది. మంచి కమర్షియల్ విలువలతో తీస్తా. ఆ కథకి నిజ జీవిత సంఘటనల ప్రభావమేమీ ఉండదు . ఒక కల్పిత కథగా తీస్తున్నా’’ అంటూ చెప్పుకొచ్చాడు వేణు.
‘విరాటపర్వం’లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్లనే ఫలితం తేడా కొట్టింది అని అతను గట్టిగా నమ్ముతున్నాడు. అందుకే తన నెక్స్ట్ మూవీ విషయంలో ముందుగానే ఆ కథ పై క్లారిటీ ఇచ్చేశాడు. మైత్రి, సితార బ్యానర్లలో వేణు ఓ సినిమా చేయాల్సి ఉంది. కాబట్టి ఆ కథ ఈ రెండు బ్యానర్లలో రూపొందే అవకాశం ఉందని వినికిడి.