Virata Parvam Movie: మనసు మార్చుకున్న ‘విరాటపర్వం’ టీం..!

రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట పర్వం’. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చెరుకూరి సుధాకర్ నిర్మించారు. ప్రియమణి కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ఇంకా 5 రోజుల వర్క్ బ్యాలన్స్ ఉందని వినికిడి. ఇక విడుదల తేదీ కూడా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది.

ఇదిలా ఉండగా.. ‘నారప్ప’ ‘దృశ్యం2’ లా ఈ చిత్రాన్ని కూడా ఓటిటిలోనే విడుదల చేస్తారు అంటూ కొద్దిరోజులు ప్రచారం జరిగింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ ఆలోచనని మార్చుకున్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి. ఒకటి, రెండు హిట్లు కూడా పడ్డాయి. దసరా తరువాత థియేటర్లకి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరగొచ్చని సినీ ఇండస్ట్రీల్లో వినిపిస్తున్న టాక్ .

దాంతో నిర్మాత సురేష్ బాబు ..మనసు మార్చుకుని ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అయితే మంచి ఓటిటి రేటు వచ్చినప్పటికీ ‘అరణ్య’ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసి తప్పు చేసారని.. ‘విరాటపర్వం’ విషయంలో ఆ తప్పు చేయొద్దని ‘విరాటపర్వం’ నిర్మాతలు భావిస్తున్నట్టు మరోపక్క ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus