మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. అజయ్, యాంకర్ శ్యామల, సునీల్, రాజీవ్ కనకాల, సాయి చంద్, అభినవ్ గోమఠం వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించగా ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు.
ఏప్రిల్ 21న రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది ఈ చిత్రం. కొత్త సినిమాలు రిలీజ్ అయినా అవి ‘విరూపాక్ష’ ముందు నిలబడలేకపోయాయి.ఇప్పటికీ డీసెంట్ షేర్స్ ను రాబడుతూనే ఉంది ఈ మూవీ. ఒకసారి 25 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
15.92 cr
సీడెడ్
5.48 cr
ఉత్తరాంధ్ర
5.16 cr
ఈస్ట్
2.62 cr
వెస్ట్
1.89 cr
గుంటూరు
2.47 cr
కృష్ణా
2.49 cr
నెల్లూరు
1.22 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
37.25 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.88 cr
ఓవర్సీస్
5.86 cr
మిగతా భాషల్లో
0.53 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
46.52 cr (షేర్)
‘విరూపాక్ష’ (Virupaksha) చిత్రానికి రూ.22.36 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.22.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ 25 రోజులు పూర్తయ్యేసరికి ..రూ.46.52 కోట్ల షేర్ ను రాబట్టింది.బయ్యర్స్ కు రూ.23.72 కోట్ల లాభాలను అందించింది ఈ మూవీ.
గ్రాస్ పరంగా రూ.92 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. మిగతా భాషల్లో కనుక కొంతలో కొంత రాణించినా ఈ మూవీ వంద కోట్ల క్లబ్ లో చేరేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిందనే చెప్పాలి.