Virupaksha: కార్తీక్ దండుకి ‘విరూపాక్ష’ మొదటి సినిమా కాదు..మరి ఏదంటే?

సాయి ధరమ్ తేజ్ స్పృహలో లేనప్పుడు ‘రిపబ్లిక్’ అనే చిత్రం రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఫలితమేంటి అన్న విషయం అతనికి కూడా తెలీదు. భయంకరమైన యాక్సిడెంట్ అతను చేసిన సినిమా ‘విరూపాక్ష’. ఏప్రిల్ 21న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అజయ్, సాయి చంద్, యాంకర్ శ్యామల,సునీల్, అభినవ్ గోమటం వంటి వారు కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి.

హర్రర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సాయి ధరమ్ తేజ్ చాలా ధీమాగా ఉన్నాడు. ‘ఎస్వీసిసి’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని అందించారు అన్న సంగతి తెలిసినప్పటి నుండి ప్రేక్షకులకు ఈ సినిమా పై ప్రత్యేకమైన ఆసక్తి పెరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇదిలా ఉండగా.. ‘విరూపాక్ష’ (Virupaksha) దర్శకుడు కార్తీక్ దండుకి ఇది డెబ్యూ మూవీ అని అంతా అనుకుంటున్నారు. ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు కూడా అలాగే ట్వీట్లు వేస్తున్నారు. నిన్న రవితేజ కూడా కార్తీక్ దండుని డెబ్యూ డైరెక్టర్ అంటూ పేర్కొన్నాడు. కానీ అందులో నిజం లేదు. గతంలో కార్తీక్ దండు ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. అది వచ్చి వెళ్లినట్టు కూడా జనాలకు తెలీదు. ఆ సినిమా మరేదో కాదు ‘భమ్ బోలేనాథ్’. 2015 లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది.

నవదీప్, నవీన్ చంద్ర మెయిన్ రోల్స్ పోషించిన ఈ మూవీ బాగానే ఉంటుంది. కానీ అప్పట్లో ప్రమోషన్లు పెద్దగా చేయకపోవడంతో ఈ సినిమా వచ్చి వెళ్లినట్టు కూడా జనాలకు తెలీదు. అయితే ‘విరూపాక్ష’ చిత్రం తప్పకుండా కార్తీక్ దండుకి దర్శకుడిగా మంచి పేరు తెచ్చి పెడుతుంది అని అనడంలో అతిశయోక్తి లేదు. కాకపోతే ‘విరూపాక్ష’ సక్సెస్ లో చాలా వరకు సుకుమార్ పాత్ర ఉంది. అది కాకుండా ఇంకో మంచి హిట్ కార్తీక్ దండు ఇవ్వాల్సి ఉంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus