యాక్షన్ సీన్స్, ఫైట్స్, రిస్కీ షాట్స్‌లో డూప్‌ను పెట్టుకోవడానికి నేటి తరం హీరోలు అంతగా ఇష్టపడటం లేదు. నేరుగా మేమే చేసేస్తాం అంటూ ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో షూటింగ్‌లో గాయపడుతున్నారు కూడా. అలా గాయపడేవారిలో తమిళ సీమలో విశాల్ ఒకరు అని చెప్పొచ్చు. అయితే సినిమాకు ఒకసారి గాయపడటం అంటేనే ఇబ్బంది. అలాంటి ఒకే సినిమా షూటింగ్‌లో ఒకసారికి మించి గాయపడటం అంటే ఇబ్బందే అని చెప్పాలి. ఇప్పుడు విశాల్ మరోసారి గాయపడ్డాడు. ఈసారి కూడా ‘లాఠీ’ సినిమా షూట్‌లోనే.
ముందు చెప్పినట్లు తరచూ తన సినిమాల్లో రియల్ స్టంట్స్ చేస్తూ విశాల్ గాయపడుతున్నారు. ఇటీవల ‘సామాన్యుడు’ సినిమా షూటింగ్‌లో విశాల్ గాయపడ్డాడు. దీంతో కొన్నాళ్లు రెస్ట్ తీసుకొని మళ్లీ షూట్ మొదలుపెట్టి పూర్తి చేశాడు. ఆ తర్వాత ‘లాఠీ’ షూటింగ్‌లో మరోసారి గాయపడ్డాడు. వేళ్లకు గాయమవ్వడంతో చికిత్స తీసుకున్న తర్వాత ఇటీవల మూవీ క్లైమాక్స్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు విశాల్. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే తాజా షెడ్యూల్‌లో కూడా విశాల్ గాయపడ్డాడు. ఈ మేరకు చిత్రబృందం సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. సినిమా షూటింగ్‌లో భాగంగా మరోసారి విశాల్ పాదానికి గాయమైంది. అయితే ఈసారి విశాల్ షూట్‌కి గ్యాప్ ఇవ్లలేదు. కాస్త రెస్ట్ తీసుకొని తిరిగి షూటింగ్‌కి వచ్చేశాడు. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. సీన్‌లో భాగంగా ఒక్కసారిగా జనం అందరూ విశాల్‌ని ఎటాక్ చేయాలి. ఈ క్రమంలో అందరూ మీదకి రావడంతో విశాల్ కాలికి గాయమైంది.
దీంతో విశాల్ కాలి నొప్పితో కింద పడిపోయాడు. వెంటనే డాక్టర్స్ టీమ్ వెంటనే చికిత్స అందించింది. దీంతో షూటింగ్ మళ్లీ మొదలుపెట్టినా.. గాయం ఇబ్బంది పెరగడంతో ఆపేశారు. ఇప్పుడు విశాల్ రెస్ట్ తీసుకుంటున్నారని, పూర్తిగా కోలుకున్నాక షూటింగ్ మొదలుపెడతామని యూనిట్ చెబుతోంది. ఇదే సినిమా చిత్రీకరణలో ఫిబ్రవరిలో తొలిసారి గాయపడ్డాడు విశాల్. అప్పుడూ యాక్షన్ సన్నివేశాల్లో భాగంగానే ప్రమాదానికి గురయ్యారు.