Dil Raju: దిల్‌ రాజు సారీ చెప్పి విషయం పక్కన పెట్టారు కానీ.. ఈ మాటలు ఇంకెవరూ అనలేదా?

తెలంగాణ సంస్కృతి మటన్‌ ముక్క, కల్లు చుక్క ప్రస్తావన ఇప్పటిది కాదు. చాలా తరాలుగా ఉంది. పండగ వచ్చినా, శుభకార్యం వచ్చినా తెలంగాణలో చాలా కుటుంబాల్లో చూసినా ఆ రెండూ ఉంటాయి. ఇది మేమనే మాట కాదు. తెలంగాణ ఏ మూల చూసినా ఇలాంటి కుటుంబాలు కనిపిస్తాయి. అయితే ఇది తప్పు కాదు. ఇక్కడి ఆచారంలో భాగంగా చాలా ఏళ్లుగా నడుస్తోంది.

Dil Raju

ఈ విషయాన్ని చాలామంది పెద్ద పెద్ద వేదికల మీదే మాట్లాడారు. అందులో రాజకీయ నాయకులు, సినిమా జనాలు ఉన్నారు. అయితే ఇన్నేళ్లుగా లేని నొప్పి, మనోభావాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. రాజకీయ రంగు మనిషిని చూసే విధానాన్ని మార్చేస్తుంది. అప్పటివరకు స్నేహితుడిగా కనిపించే వ్యక్తి.. ఒక్కసారిగా పగోడు అయిపోతాడు. ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజును కూడా అలానే చూస్తున్నారా? అని అనిపిస్తోంది.

నిజామాబాద్‌లో కొన్ని రోజుల క్రితం జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో దిల్‌ రాజు మాట్లాడుతూ దావత్‌, మటన్‌, తెల్ల కల్లు గురించి మాట్లాడారు. దాంతో ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తెలంగాణ అంటే ఆ రెండేనా అని మీరు అన్నారు అనిపిస్తోంది. ఇది సరికాదు అని కామెంట్లు చేశారు. దీంతో ఆయన సారీ చెప్పారు. అయితే ఈ మాట అన్నది ఆయనొకరేనా? అనే ప్రశ్న వినిపిస్తోంది.

గతంలో తెలంగాణ సీనియర్‌ నాయకుడు, ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఓ నాయకుడు ఇంచుమించు ఇలానే మాట్లాడారు. ఒకట్రెండుసార్లు కాదు.. చాలా సందర్భాల్లో ఇదే మాట చెప్పారు. ఆన్‌ రికార్డు కూడా ఇవి ఉన్నాయి. కానీ ఆయనను అప్పుడు ఎవరూ ఏమీ అనలేదు. ఇప్పుడు ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు అనుసంధానంగా ఉన్న పదవిలో కూర్చున్న దిల్‌ రాజు అంటే సమస్య వచ్చింది అనే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అంతా చెప్పి ఆ మాటలు అన్నదెవరో చెప్పలేదు అనుకుంటున్నారా? అనుకోరులెండి. ఎందుకంటే మీకు తెలుసు ఆయనెవరో.

త్రినాథరావు నక్కిన ఇబ్బందికర వ్యాఖ్యలు… ఇలా ఎందుకు చేశారు అవసరమా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus