Vishwak Sen: అజయ్ భూపతితో అందుకే సినిమా చేయలేదు!
- November 23, 2023 / 09:31 AM ISTByFilmy Focus
డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ నటించిన తాజా చిత్రం మంగళవారం ఈ సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తాజాగా చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. అదేవిధంగా నటుడు విశ్వక్ సేన్ కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా విశ్వక్ అజయ్ భూపతి గురించి అలాగే ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇకపోతే తనకు అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాలో అవకాశం వచ్చిందని అప్పుడు నేను మహాసముద్రం సినిమాలో నటించలేకపోయాను అంటూ ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు. అయితే ఎందుకు నటించలేకపోయారు. అనే విషయాన్ని కూడా విశ్వక్ (Vishwak Sen) తెలిపారు.

అజయ్ భూపతి మహాసముద్రం సినిమాకు తనని సంప్రదించినప్పుడు తాను మరొక సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నానని అందుకే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతోనే తాను మహాసముద్రం సినిమాలో నటించలేకపోయానని అయితే ఇప్పుడు మాత్రం అజయ్ భూపతి గారితో నటించడానికి తాను సిద్ధంగానే ఉన్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!













