రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరో విశ్వక్ సేన్!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన సినిమా ‘హిట్’. అప్పటివరకు ఆయన నటించిన ‘వెళ్లిపోమాకే’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్ నుమా దాస్’ సినిమాలు కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. ‘హిట్’ సినిమా మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్నట్లు దర్శకుడు శైలేష్ కొలను ప్రకటించారు. హీరోగా విశ్వక్ నే ఊహించుకున్నారు అందరూ. కానీ విశ్వక్ సేన్ ఈ ప్రాజెక్ట్ కి దూరమయ్యాడు.

అతడి స్థానంలో హీరో అడివి శేష్ ను తీసుకున్నారు. దీంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. కానీ ‘హిట్’ లాంటి ఫ్రాంఛైజీని విశ్వక్ ఎందుకు వదులుకున్నాడనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాజెక్ట్ నుండి విశ్వక్ ను తప్పించారా..? లేక తప్పుకున్నాడా..? అనే విషయంలో క్లారిటీ లేకపోయింది. తాజాగా ఈ విషయంలో విశ్వక్ సేన్ స్పందించాడు. ప్రస్తుతం తాను వరుస సినిమాలు కమిటై ఉన్నానని.. వాటి మధ్య ‘హిట్ 2’ సినిమాకి కాల్షీట్లు ఇవ్వలేక ఈ సినిమా నుండి తప్పుకున్నానని విశ్వక్ సేన్ వెల్లడించాడు.

ప్రస్తుతం ఈ హీరో ‘పాగల్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దీంతో పాటు ‘ప్రాజెక్ట్ గామి’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. అలానే తమిళంలో సక్సెస్ అయిన ‘ఓ మై కడవులే’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. మరో కొత్త దర్శకుడితో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఇన్ని ప్రాజెక్ట్స్ లైన్లో ఉండడంతో ‘హిట్’ సీక్వెల్ చేయలేకపోతున్నానని వెల్లడించాడు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus