తన యాటిట్యూడ్ తో బోలెడంత మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు అంటూ విజయ్ దేవరకొండ గురించి అందరూ చెబుతుంటారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు అన్నది మరికొందరి మాట. ఆటిట్యూడ్ తో కొంతవరకూ జనాల అటెన్షన్ ను అతను డ్రా చేసుకుని ఉండొచ్చు. కానీ అతను ఎంపిక చేసుకున్న యూత్ ఫుల్ కథలు.. మరియు వాటిని జనాలకి చేరువయ్యేలా ప్రోమోట్ చేసిన విధానమే.. అతను నటించిన సినిమా సక్సెస్ అవ్వడానికి కారణమయ్యాయి అని వారు విశ్లేషిస్తున్నారు.
సినిమాలో మేటర్ లేకుండా.. రెండున్నర గంటల పాటు హీరో ఆటిట్యూడ్ ని చూసి ఎంజాయ్ చేసే ఓపిక ఇప్పట్లో ఎవ్వరికీ లేదు. చిన్న హీరో సినిమా అయినా పెద్ద సినిమా హీరో అయినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తేనే ఆడుతుంది. లేదంటే ఘోర పరాజయం పాలవవుతుంది అనడంలో సందేహం లేదు. విజయ్ దేవరకొండ విషయాన్ని అటుంచితే.. అతనిలా ఆటిట్యూడ్ చూపించి జనాలను ఆకర్షించాలని హీరో విశ్వక్ సేన్ చాలా ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. తాజాగా విడుదలైన ‘పాగల్’ టీజర్ చూస్తే.. అది క్లియర్ కట్ గా తెలుస్తుంది.
‘ఈ నగరానికి ఏమైంది?’ ‘ఫలక్ నుమా దాస్’ ‘హిట్’ వంటి వరుస విజయాలతో విశ్వక్ సేన్ సినిమాల పై క్రేజ్ పెరిగింది అనేది వాస్తవం. కానీ మన రౌడీ హీరోలా యాటిట్యూడ్ తో నెట్టుకురావాలి అంటే చాలా కష్టం. సోషల్ మీడియాలో విశ్వక్ సేన్ గురించి ఇలాగే కామెంట్లు పెడుతున్నారు కొందరు నెటిజన్లు. చెప్పాలంటే విజయ్ దేవరకొండ సినిమాలకు ఉండే మార్కెట్ లో విశ్వక్ సినిమాలకు సగానికి సగం ఏర్పడలేదు అనేది వాస్తవం. కాబట్టి దేవరకొండని ఫాలో అవ్వడం మానేసి.. నటనలో వైవిద్యం చూపిస్తే బెటర్ అని కొందరు సూచిస్తున్నారు.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?