విశ్వక్ సేన్ (Vishwak Sen) సినిమా వస్తుంది అంటే సోషల్ మీడియాలో హడావిడి గట్టిగానే ఉంటుంది. ఒకవేళ లేకపోయినా.. ఏదో ఒక రకంగా విశ్వక్ సేన్ హడావిడి క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇందుకోసం అతని వద్ద సెపరేట్ గా ఒక టీం ఉందని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే అతను ఎంత హడావిడి చేసినా ఒక కంప్లీట్ హిట్ అయితే కొట్టలేకపోతున్నాడు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా… బాక్సాఫీస్ వద్ద అతని సినిమాలు నిలబడవు.
ముఖ్యంగా విశ్వక్ సేన్ సినిమాలకి ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ వస్తాయి. అయినా ఎందుకో అవి యునానిమస్ హిట్ అనిపించుకోవు. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ (Ashoka Vanamlo Arjuna Kalyanam) ‘ఓరి దేవుడా’ (Ori Devuda) వంటి సినిమాలకి హిట్ టాక్ వచ్చింది. కానీ అవి బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు.’దాస్ క ధమ్కీ’ (Das Ka Dhamki) ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది. ‘గామి’ (Gaami) బెటర్ గా ఆడింది. మళ్ళీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) సినిమాలు నిరాశపరిచాయి. ‘మెకానిక్ రాకీ’ సినిమాకి అయితే మీడియాకి, సోషల్ మీడియాకి గోల్డ్ కాయిన్స్ వంటివి ఇచ్చి కొత్త రకం ప్రమోషన్స్ చేసినా థియేటర్స్ లో అది నిలబడలేదు.
పబ్లిసిటీపై పెట్టే శ్రద్ధ సినిమా కంటెంట్ పై విశ్వక్ సేన్ పెట్టడు అనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది. మరో 4 రోజుల్లో ‘లైలా’ (Laila) రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం విశ్వక్ చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా లేడీ గెటప్ తో కొత్త ప్రయోగమే చేస్తున్నాడు. కానీ ట్రైలర్లో కంటెంట్ అయితే రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ‘మేడమ్’ వంటి సినిమాల స్టైల్లోనే ఉంటుందేమో అనిపిస్తుంది. అయినప్పటికీ విశ్వక్ సేన్ చేసిన ప్రయోగానికి అయినా ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరు గెస్ట్ గా రావడం వల్ల.. ‘లైలా’ కి వచ్చిన బెనిఫిట్ ఉందా? అంటే అలాంటిదేమీ ప్రస్తుతానికి కనిపించడం లేదు. ‘లైలా’ ఈవెంట్లో చిరంజీవి (Chiranjeevi) స్పీచ్ వల్ల ప్రజారాజ్యం పార్టీ, జనసేన పార్టీ గురించి.. 30 ఇయర్స్ పృథ్వీ(Prudhvi Raj) స్పీచ్ వల్ల వైసీపీ పై పడిన సెటైర్ల గురించి మాత్రమే మాట్లాడుతుకుంటున్నారు. పోనీ వీటి వల్ల అయినా ‘లైలా’ కి కలిసొచ్చి అన్ని ఏరియాల్లోనూ వసూళ్లు రాబడుతుందేమో చూడాలి