విశ్వక్ సేన్ ను ప్రపోజ్ చేసే క్రమంలో నోరు జారిన అమ్మాయి..!

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం మే 6న విడుదల కాబోతుంది.వింత వింత పద్దతిలో ఈ చిత్రం ప్రమోషన్లను నిర్వహించిన విశ్వక్ సేన్.. చిక్కుల్లో పడి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాడు. అవేమో కానీ సినిమాకి మాత్రం ఆ కాంట్రవర్సీలు బాగా హెల్ప్ అయ్యాయి.ఇక నిన్న ఖమ్మంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో కొంతమంది అమ్మాయిలతో విశ్వక్ సేన్ చేసిన కామెడీ బాగా వైరల్ అయ్యింది.

ఈ సినిమా కథాంశం ప్రకారం ఓ పెళ్లి చూపుల ఎపిసోడ్ ను నిర్వహించారు. ఇందులో భాగంగా కొంత మంది అమ్మాయిలు విశ్వక్ సేన్‌కు ప్రపోజ్ చేయడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఓ అమ్మాయి నేరుగా వచ్చి ఐ లవ్ యూ అని చెప్పింది.దీంతో విశ్వక్ సేన్.. ‘అంతేనా? సరిపోద్దా?’ అంటూ తన అభిమానులను చూస్తూ అడుగుతాడు. తర్వాత విశ్వక్ ఓ పెళ్ళైన ఓ ఆవిడని… ‘ఈ ఆంటీని సెలెక్ట్ చేయండి’ అంటూ అంటాడు.

దీంతో యాంకర్ గీత భగత్ ‘మనం సెలెక్ట్ చేసుకోవడం కాదు.. ఆల్రెడీ ఆమెను సెలెక్ట్ చేసుకున్నారు. పక్కనే ఉన్నారు చుడండి’ అంటూ ఆమె భర్తను చూపిస్తుంది. అయ్యో సారీ సర్ మీరు పక్కన ఉండగానే ఇలా ఏంటి సర్ అంటూ ఫన్ జెనరేట్ చేస్తాడు విశ్వక్ సేన్. ఈ క్రమంలో ఆ పక్కన ఉన్న ఇంకో అమ్మాయి ‘నా పక్కన ఎవ్వరూ లేరు కదా? నన్ను ఉంచుకోండి’ అంటూ అంటుంది. దీంతో అక్కడున్నవారు షాక్ అవుతారు.

‘యూట్యూబ్ థంబ్ నెయిల్స్ వాళ్లు రెడీగా ఉంటారు.. ఏం మాట్లాడకపోతేనే ఏదో ఒకటి రాస్తారు.. నువ్ ఇలా అంటే ఇంకెలా రాస్తారో’ అంటూ యాంకర్ గీత్ భగత్ కామెంట్స్ చేస్తుంది. దీంతో ఈ టాపిక్ వైరల్ గా మారింది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus