Jr NTR: ఇచ్చిన మాట తప్పకూడదని తారక్ అలా చేశారు.. విశ్వక్ కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా ఈ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన విశ్వక్ సేన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ తారక్ గొప్పదనం గురించి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. సింహాద్రి సినిమా రీరిలీజ్ గురించి దేశమంతా చర్చించుకుంటోందని ఆయన తెలిపారు. ఈ సినిమా నేషనల్ న్యూస్ కావడం గ్యారంటీ అని విశ్వక్ సేన్ వెల్లడించారు.

నాకు తెలిసినంతవరకు ఏ ఫ్యాన్ కు ఇలాంటి ఛాన్స్ రాలేదని ఆయన తెలిపారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ వేడుక తర్వాత మరో రెండు రోజులు అక్కడే ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ ను కోరినా హైదరాబాద్ లో దాస్ కా ధమ్కీ మూవీ ఈవెంట్ కోసం వచ్చారని విశ్వక్ సేన్ వెల్లడించడం గమనార్హం. తారక్ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. ఈ విషయం నాకు ఒక వ్యక్తి చెబితే తెలిసిందని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒక రేంజ్ కు చేరుకున్న తర్వాత కూడా అభిమానికి ఇచ్చిన మాట కోసం దాస్ కా ధమ్కీ ఈవెంట్ కు వచ్చారని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. సినిమాల రీరిలీజ్ కల్చర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మొదలైందని ఆయన చెప్పుకొచ్చారు. రీ రిలీజ్ సినిమాలకు కూడా ప్రీ రిలీజ్ చేసి స్థాయికి చేరుకున్నామని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గురించి అడగాలంటే భారతదేశం దాటి అడగాలని విశ్వక్ సేన్ అన్నారు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ సింహాద్రి మూవీ ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని వెల్లడించారు. హను రాఘవపూడి మాట్లాడుతూ తాను ఎన్టీఆర్ కు వీరాభిమానినని సింహాద్రి ప్రీ ప్రొడక్షన్ వర్క్, షూటింగ్ చూశానని పేర్కొన్నారు. టాలీవుడ్ డైరెక్టర్లు తారక్ గురించి పాజిటివ్ గా కామెంట్లు చేయడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus