టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, దాస్ కా ధమ్కీ సినిమాల సక్సెస్ లతో విశ్వక్ సేన్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుసగా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు కూడా ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ సీక్వెల్స్ ను మాత్రం తనే తెరకెక్కించాలని విశ్వక్ సేన్ భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి ఎప్పుడు వెళతాయో తెలియాలంటే మాత్రం మరి కొన్నేళ్లు ఆగాల్సిందే. అయితే నితిన్ కృష్ణచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ఒక సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను నితిన్ వదులుకోగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో విశ్వక్ సేన్ హీరోగా ఈ సినిమా తెరకక్కనుంది.
ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. విశ్వక్ సేన్ వేగంగా సినిమాలలో నటించడం కంటే ఈ జనరేషన్ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలలో నటించాలని భావిస్తున్నారు. విశ్వక్ సేన్ వరుస విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విశ్వక్ సేన్ పారితోషికం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ కెరీర్ ప్లానింగ్ బాగుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
విశ్వక్ సేన్ (Vishwak Sen) సినిమాలకు నందమూరి హీరోల నుంచి సపోర్ట్ లభిస్తోంది. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ విశ్వక్ సేన్ తమ వంతు సహాయం చేస్తున్నారు. విశ్వక్ సేన్ ప్రస్తుతం గామి అనే ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. సినిమా సినిమాకు విశ్వక్ సేన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే విశ్వక్ సేన్ 40 కోట్ల రూపాయల రేంజ్ లో మార్కెట్ ను సొంతం చేసుకుంటాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.