Vishwak Sen: ఎన్టీఆర్ డిన్నర్ కు పిలిచి మాటిచ్చారు.. విశ్వక్ కామెంట్స్ వైరల్!

విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన దాస్ కా ధమ్కీ ఈ నెల 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటానని విశ్వక్ సేన్ భావిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ నేను ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడలేదని పేర్కొన్నారు. ఇప్పుడు మన సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అని ఆయన చెప్పుకొచ్చారు. గతంలోనే ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాల్సి ఉందని కానీ మిస్ అయిందని ఆయన తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి ఇంటికి డిన్నర్ కు పిలిచారని ఆ సమయంలో ఈవెంట్ కు వస్తానని మాట ఇచ్చారని విశ్వక్ సేన్ అన్నారు. సార్ అంటే బాలయ్య తిడతారని ఫ్రెండ్, బ్రో అని పిలుస్తారని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు. బాలయ్యగారు చాలా స్వీట్ అని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. ఇప్పటి టీనేజర్స్ మెంటాలిటీ నాకు తెలియదని ఆయన అన్నారు. అప్ డేట్ అవుతూ ఉండాలని ఆయన కామెంట్లు చేశారు.

గెటౌట్ డైలాగ్ గురించి విశ్వక్ సేన్ స్పందిస్తూ అది కార్ లో వచ్చిన ఐడియా అని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. సెకండ్ స్టేజ్ కు వెళ్దాం అన్నావ్ మెడికల్ షాప్ కు వెళ్లనా అనే డైలాగ్ చెప్పగా నివేదా గెటౌట్ అని చెబుతుందని ఆయన కామెంట్లు చేశారు. డైలాగ్ కనెక్ట్ అవ్వాలనే పెడతాం అని ఆయన తెలిపారు. ఆ ఘటన సమయంలో పబ్లిక్ నుంచి సపోర్ట్ లభించిందని విశ్వక్ సేన్ వెల్లడించారు.

నాపై ఆటిట్యూడ్ చూపిస్తే నేను కూడా చూపిస్తానని విశ్వక్ సేన్ అన్నారు. యాక్షన్ ను బట్టి రియాక్షన్ ఉంటుందని ఆయన తెలిపారు. మార్చి 29 నా పుట్టినరోజు అని ఆయన పేర్కొన్నారు. తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారని విశ్వక్ సేన్ అన్నారు. మదర్ తో ఉండే ఒక సీన్ అద్భుతంగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రొడ్యూసర్ గా ఉండటం చాలా టఫ్ అని ఆయన తెలిపారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus