Vishwak Sen: ఆ సినిమాల వల్ల విశ్వక్ మూవీకి నష్టమేనా?

  • May 13, 2022 / 03:27 PM IST

మే నెల 6వ తేదీన రికార్డు స్థాయి థియేటర్లలో సాధారణ టికెట్ రేట్లతో విడుదలైన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను, పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు రాగా సెకండ్ వీకెండ్ ను కూడా ఈ సినిమా క్యాష్ చేసుకుంటుందని ఫ్యాన్స్ భావించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో కనిపించడం లేదు.

మహేష్ హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా కోసం ఈ సినిమా కొన్ని థియేటర్లను త్యాగం చేయక తప్పలేదు. అయితే ఆచార్య, కేజీఎఫ్2 సినిమాలను ఇప్పటికీ పలు థియేటర్లలో ప్రదర్శిస్తుండటంతో అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకు థియేటర్ల విషయంలో అన్యాయం జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అశోకవనంలో అర్జున కళ్యాణం ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ కాలేదు. థియేటర్ల సంఖ్య పెరిగితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.

చిన్న సినిమాలను బ్రతికించాలనే నిర్మాతలు ఈ సినిమాపై దృష్టి పెడితే బాగుంటుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీకెండ్ లో ఈ సినిమాను చూడాలని భావిస్తున్నా దగ్గర్లోని థియేటర్ లో ఈ సినిమాను ప్రదర్శించడం లేదని మరి కొందరు చెబుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ఉన్న ఈ సినిమా తక్కువ థియేటర్లతో ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.

మరోవైపు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తలను విశ్వక్ సేన్ ఖండించారు. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందో తెలియాల్సి ఉంది. ఏపీలో చిన్న సినిమాలకు ఒక షో కేటాయించాలని నిబంధనలు ఉన్నా ఆ నిబంధనల విషయంలో ఎంతో కన్ఫ్యూజన్ ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus