టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్ట్ లతో విశ్వక్ సేన్ (Vishwak Sen) కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. విశ్వక్ సేన్ కొత్త సినిమా మెకానిక్ రాకీ అనే టైటిల్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. రామ్ తాళ్లూరి (Ram Talluri) నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ఇండియా వైడ్ హక్కులు 8 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని భోగట్టా.
ఆసియన్ సురేష్ సంస్థ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం అందుతోంది. ఆసియన్ సురేష్ సంస్థకు ఈ డీల్ మంచి డీల్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ నెల 14వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందనే సంగతి తెలిసిందే. రిలీజైన రెండు వారాలకే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండటంపై అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కనీసం 4 వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే బాగుండేదని మరి కొందరు చెబుతున్నారు. విశ్వక్ సేన్ సినిమాలకు నందమూరి హీరోల సపోర్ట్ లభిస్తుండటం ప్లస్ అవుతోంది. విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయలకు అటూఇటూగా ఉందని సమాచారం అందుతోంది. విశ్వక్ సేన్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైతే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
విశ్వక్ సేన్ ఈ జనరేషన్ యూత్ కు నచ్చే కథలను ఎంపిక చేసుకుంటూ సత్తా చాటుకున్నారు. విశ్వక్ సేన్ వేగంగా సినిమాలలో నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. విశ్వక్ సేన్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విశ్వక్ సేన్ నటన విషయంలో సైతం కొత్తదనం చూపిస్తూ అంతకంతకూ ఎదుగుతున్నారు. తన సినిమాల పాటల విషయంలో సైతం విశ్వక్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.