రాహుల్ సిప్లిగంజ్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీక‌రించిన డాషింగ్ హీరో విష్వ‌క్ సేన్‌

ప్ర‌కృతిని ప‌రిర‌క్షించుకోవాల‌నే ఉద్దేశంతో రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినిప‌ల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ప్రోగ్రామ్‌ మూడ‌వ విడ‌త‌లో భాగంగా సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ విసిరిన ఛాలెంజ్‌ను డాషింగ్ హీరో విష్వ‌క్ సేక్ స్వీక‌రించారు. హైద‌రాబాద్‌, జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ వ‌ద్ద ఉన్న జీహెచ్ఎంసీ పార్కులో ఆయ‌న‌ మొక్క‌లు నాటారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మ‌నిషి బ్ర‌త‌క‌డానికి మొక్క‌లు ఎంతో అవ‌స‌ర‌మ‌నీ, ఎంపీ సంతోష్‌కుమార్ చొర‌వ తీసుకొని గ్రీన్ ఛాలెంజ్ వంటి గొప్ప‌ ప్రోగ్రామ్‌ను చేప‌ట్టాడార‌ని కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో గ్రీన్ ఛాలెంజ్ ప్ర‌తినిధి రాఘ‌వ పాల్గొన్నారు.అనంత‌రం హీరో అల్లు శిరీష్‌, హిట్ డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను, న‌టుడు అభిన‌వ్ గోమ‌ఠం, హీరో కార్తికేయ ల‌కు విష్వ‌క్ సేన్‌ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.


Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus