చిరంజీవి ‘విశ్వంభర’ , పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలపై మొదటి నుండి అంచనాలు లేవు. ఈ 2 సినిమాల షూటింగ్లు అనేక సార్లు వాయిదా పడటం, తర్వాత మళ్ళీ రీషూట్లు జరగడం.. ఇలా రకరకాల కారణాలతో ఆలస్యం అయ్యాయి. రిలీజ్ డేట్లు కూడా వాయిదా పడుతూ వచ్చాయి. ఓ దశలో ఈ సినిమాలు ఇప్పట్లో రిలీజ్ కావడం కష్టం అనే అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయి.
‘హరిహర వీరమల్లు’ సినిమాకి అయితే బిజినెస్ కూడా జరగడం కష్టమైంది. ఇలాంటి టైంలో రిలీజ్ అయితే భారీ నష్టాలు రావడం కూడా ఖాయమని అందరూ పెదవి విరిచారు. అయితే నిర్మాత ధైర్యం చేసి ట్రైలర్ ను వదిలారు. పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ కు వచ్చి ‘ఈ సినిమా చూడాలని ప్రేక్షకులను స్వాగతించారు’.. అది వర్కౌట్ అయ్యింది. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా.. వీకెండ్ కు 70 శాతం రికవరీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సో వీరమల్లు నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో అయినా బడ్జెట్ రికవరీ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సెకండ్ పార్ట్ తీసి ఓటీటీకి ఇచ్చేసినా మంచి రిటర్న్స్ వస్తాయి. ఇక ‘వీరమల్లు’ రిజల్ట్ ని చూసి ‘విశ్వంభర’ టీంకి కూడా ధైర్యం వచ్చింది. సరిగ్గా సినిమాను కనుక ప్రమోట్ చేసుకుంటే ఇప్పుడున్న నెగిటివిటీని రూపుమాపువచ్చు. సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి…నాన్ స్టాప్ ప్రమోషన్స్ కనుక చేసుకుంటే ‘విశ్వంభర’ కూడా గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు వశిష్ట్ మల్లిడి కూడా ఆ మార్గంలోనే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.