‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి (Vijaya Shanthi) కీలక పాత్ర పోషించింది. తల్లీ కొడుకులుగా విజయశాంతి, కళ్యాణ్ రామ్ నటించారు. ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) ఈ సినిమాకి దర్శకుడు. ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను రాబట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ టాక్ కి తగ్గట్టు కలెక్ట్ చేసింది లేదు.
మంగళ, బుధ వారాలకి సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అని డిస్ట్రిబ్యూటర్లు చెప్పినట్టు కళ్యాణ్ రామ్ చెప్పారు. కానీ అలా జరగలేదు. కనీసం 50 శాతం రికవరీ కూడా జరగలేదు. మరోపక్క ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అవ్వలేదు అనేది ఇన్సైడ్ టాక్. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్, విజయశాంతి పారితోషికాలు కాకుండా రూ.35 కోట్లు బడ్జెట్ అయ్యింది.
కళ్యాణ్ రామ్ రూ.8 కోట్లు, విజయశాంతి రూ.4 కోట్లు పారితోషికం అందుకున్నట్టు టాక్. సో మొత్తంగా రూ.47 కోట్లు.. మిగిలిన ఖర్చులతో కలుపుకుని ఆ లెక్క రూ.50 కోట్ల వరకు వెళ్ళిందట. ఇదిలా ఉంటే… ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ ని ‘అశోకా క్రియేషన్స్’ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు నిర్మించారు.
కానీ ముందుగా ఈ ప్రాజెక్టు ‘యూవీ క్రియేషన్స్’ లో ఓకే అయ్యిందట. అంటే ‘విశ్వంభర’ నిర్మాతలు ఈ సినిమాను కూడా నిర్మించాలన్న మాట. కానీ కొన్ని కారణాల వల్ల ‘యూవీ’ వాళ్ళు ఈ ప్రాజెక్టుని హోల్డ్ లో పెడితే… కళ్యాణ్ రామ్ తన సమర్పణలో ‘అశోకా క్రియేషన్స్’ వారికి నిర్మించుకునే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలా చూసుకుంటే.. ‘విశ్వంభర’ (Vishwambhara) నిర్మాతలకి రూ.50 కోట్లు మిగిలినట్టే అనుకోవాలి.