Viswam: ఒక్క హిట్టూ లేదనుకుంటున్న టైంలో.. బానే కలిసొచ్చిందిగా..!

ఇటీవల వచ్చిన ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. వెన్నెల కిషోర్ (Vennela Kishore) తో ఓ అమ్మాయి పలికే డైలాగ్ అది. ఆ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.. ‘సినిమాలో హీరోయిన్.. అంటే జస్ట్ 4 పాటలు, దానికి ముందు వచ్చే సన్నివేశాల్లో కనిపిస్తుంది’ అన్నట్టు ఆ పాత్ర చెబుతుంది. ఆ డైలాగ్ రియల్ లైఫ్ లో చూసుకుంటే.. కావ్య థాఫర్ (Kavya Thapar) కి కరెక్ట్ గా సెట్ అయిందేమో అనిపిస్తుంది.

Viswam

ఎందుకంటే 2018 లో ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కావ్య థాఫర్ కి.. ఆ తర్వాత ‘ఏక్ మినీ కథ’ (Ek Mini Katha) తో గుర్తింపు లభించింది. ఆ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయినప్పటికీ ఈ అమ్మడికి బాగానే కలిసొచ్చింది. వరుసగా ‘బిచ్చగాడు 2’ ‘ఈగల్’ (Eagle)  ‘ఊరు పేరు భైరవకోన’  (Ooru Peru Bhairavakona) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)  వంటి సినిమాల్లో నటించింది. ఇందులో ‘ఈగల్’ ‘డబుల్ ఇస్మార్ట్’ పెద్ద డిజాస్టర్స్ అయ్యాయి. మిగిలినవి హిట్లని కాదు.

‘బిచ్చగాడు 2’ కమర్షియల్ గా ఓకే అనిపించినా.. ‘ఊరు పేరు భైరవకోన’ యావరేజ్ సినిమా అనిపించుకుంది. ఇక కావ్య నటించిన లేటెస్ట్ మూవీ ‘విశ్వం’ (Viswam) అయితే ‘ఈగల్’ ‘డబుల్ ఇస్మార్ట్’..లతో పోలిస్తే పర్వాలేదు అనిపించుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద సో సో గానే పెర్ఫార్మ్ చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే.. కావ్య చేసిన ఈ సినిమాల్లో.. ఆమె పాత్రలు కూడా గొప్పగా ఉండవు.

అయినప్పటికీ గ్లామర్ వడ్డించడానికి ఈ అమ్మడు ఎప్పుడూ ముందుంటుంది. అందుకోసమే అనుకుంట ఆమెకు వరుస సినిమాల్లో ఛాన్సులు లభిస్తున్నాయి. ఇప్పుడు కూడా కావ్యకి 2 మిడ్ రేంజ్ సినిమాల్లో ఛాన్సులు లభించాయట. వాటి గురించి త్వరలోనే అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus