Siri, Shanmukh: సిరికి చాలాసార్లు చెబుదాం అనుకున్నా.. కానీ..!

బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న సిరి-షణ్ముఖ్ ఎమోషనల్ గా బాగా దగ్గరయ్యారు. ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారు. సిరికి అడిక్ట్ అయిపోతున్నానని షణ్ముఖ్.. శ్రీరామ్ తో డిస్కస్ చేశాడు. అలానే కన్ఫెషన్ రూమ్ లో నాగార్జునతో మాట్లాడిన సిరి.. ఇది తప్పని తెలిసినా.. షణ్ముఖ్ కి ఎందుకో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతున్నా అంటూ డైరెక్ట్ గా చెప్పేసింది. హగ్గులు, ముద్దులతో హౌస్ లో ఈ జంట రెచ్చిపోయింది.

దీంతో ప్రేక్షకులు వీరి బిహేవియర్ తో బాగా విసిగిపోయారు. సిరి తల్లి హౌస్ లోకి వెళ్లినప్పుడు హగ్గులు ఎక్కువైపోతున్నాయని చెప్పినా.. వీరిద్దరూ మాత్రం మానలేదు. షణ్ముఖ్ ఆల్రెడీ దీప్తి సునైనాతో ఐదేళ్లుగా రిలేషన్ లో ఉన్నాడు. సిరికి శ్రీహాన్ అనే ఆర్టిస్ట్ తో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇవన్నీ మరిచిపోయి సిరి-షణ్ముఖ్ వారికి నచ్చినట్లు హౌస్ లో ఉన్నారు. సీర్ తల్లి హౌస్ లోకి వచ్చినప్పుడు సన్నీ వాళ్ల కోసం స్టాండ్ తీసుకున్నాడు. మానస్ తో తనకు ఎలాంటి స్నేహముందో.. సిరి-షణ్ముఖ్ లాడి కూడా అలాంటి స్నేహమేనని సపోర్టివ్ గా మాట్లాడాడు.

తాజాగా సిరి-షణ్ముఖ్ ల రిలేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సన్నీ. హౌస్ లో ఉన్నప్పుడు సిరికి ఒక మాట చెప్పాలనుకున్నానని అన్నాడు సన్నీ. ‘దోస్తాన్‌ దోస్తానే కానీ బయట నిన్ను నమ్ముకుని ఒక మనిషి(శ్రీహాన్‌) ఉన్నాడు. పాపం అతడు ఫీల్‌ అవుతాడు కదా’ అని చాలా సార్లు సిరికి చెప్పాలనిపించిందని సన్నీ అన్నాడు. కానీ ఇది ఆమెకి చెబుదామనుకున్నా.. వాళ్లు తీసుకోరనిపించిందని చెప్పాడు. ఎప్పుడైనా వాళ్లతో మాట్లాడదామని వెళ్లినా.. ‘మాకు కొంచెం టైం కావాలి.

ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు అంటారు. కనెక్షనే లేనప్పుడు ఇంకేం చెప్తాం’ అంటూ చెప్పుకొచ్చాడు సన్నీ. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై సిరి కానీ షణ్ముఖ్ కానీ రియాక్ట్ అవుతారేమో చూడాలి!

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus