బిగ్ బాస్ సీజన్5 విన్నర్ వీజే సన్నీ అందరికీ సుపరిచితమే. ఇతని గేమ్ కి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ‘బిగ్ బాస్’ హౌస్ కి వెళ్ళడానికి ముందు.. ఇతను పలు సీరియల్స్ లో, బుల్లితెర షోలలో నటించిన సంగతి తెలిసిందే. దానికి ముందు ఇతను జర్నలిస్ట్ గా కూడా చేశాడు. ఇదిలా ఉండగా.. సన్నీ రెండు సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. అందులో ఒకటి ‘సకల గుణాభి రామ’, ఇంకోటి ‘అన్ స్టాపబుల్’. ఈ రెండు కూడా ఆడలేదు.
అయితే ఈసారి హీరోగా నిలబడాలి అనే ఉద్దేశంతో `సౌండ్ పార్టీ` అనే సినిమా చేశాడు. సంజయ్ శౌరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా.. ‘అన్ స్టాపబుల్’ సినిమా రిలీజ్ టైంలో రివ్యూలపై మండిపడుతూ సన్నీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. దీంతో అతని పై ట్రోలింగ్ గట్టిగానే జరిగింది. ‘సౌండ్ పార్టీ’ ప్రమోషన్స్ లో ఈ విషయం పై స్పందించాడు సన్నీ.
అతను మాట్లాడుతూ.. ‘నేను అందరి రివ్యూయర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఆ ట్వీట్ వేయలేదు. నాకు తెలిసిన ఓ రిపోర్టర్ సినిమా చూడకుండా రివ్యూ రాసి పబ్లిష్ చేశాడు. అందులో సినిమాని దారుణంగా విమర్శించాడు. ‘ఇంకా షో కూడా కంప్లీట్ అవ్వలేదు..అప్పుడే రివ్యూ ఎలా రాసారు?’ అని అడగ్గా.. ‘నేను ఎడిటింగ్ రూంలోనే చూశాను అని చెప్పాడు’. దర్శకుడు ఎడిటింగ్ టైంలో మాకే చూపించలేదు.. అతనికి ఎలా చూపించాడు అనే కోపంలో ఆ ట్వీట్ వేశాను. అది కేవలం అతన్ని ఉద్దేశించి మాత్రమే..!
నేను (VJ Sunny) కూడా జర్నలిస్ట్ గా చేసి వచ్చినవాడినే..! తోటి జర్నలిస్టులతో నేను ఎందుకు అలా విమర్శిస్తాను. నేను నటుడిగా ఎదగడానికి చాలా కష్టపడ్డాను. ‘హ్యాపీ డేస్’ సినిమా కోసం ఆడిషన్ కి వెళితే.. నన్ను రూ.25 లక్షలు కడతావా అంటూ లంచం అడిగారు. అలాంటి కష్టాలు ఎన్నో పడ్డాను అంటూ సన్నీ చెప్పుకొచ్చాడు.