Vj Sunny: బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన విజె సన్నీ!

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో సీజన్5 తెలుగు విన్నర్ విజె సన్నీ అనే సంగతి తెలిసిందే. సాధారణంగా బిగ్ బాస్ షోకు విన్నర్ గా నిలిస్తే ఆయా సెలబ్రిటీల కెరీర్ పుంజుకుంటుందని చాలామంది భావిస్తున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు విన్నర్లుగా నిలిచిన వాళ్ల జాతకాలు మాత్రం పెద్దగా మారలేదు. విజె సన్నీ తాజాగా బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ షో వల్ల ఒరిగేదేం లేదని సన్నీ తెలిపారు. ఎక్కడైనా బిగ్ బాస్ విన్నర్ నని చెబితే బిగ్ బాస్ షో అంటే ఏమిటని నన్ను రివర్స్ లో ప్రశ్నిస్తున్నారని సన్నీ చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ షో వల్ల నాకు పేరు రావడం నిజమేనని అయినప్పటికీ తాను చాలామందికి తెలియదని ఆయన కామెంట్లు చేశారు. ఒక ప్రముఖ దర్శకుడు కూడా నన్ను ఇదే విధంగా అడిగారని ఆయన వెల్లడించడం గమనార్హం.

ఆ తర్వాత నేను బిగ్ బాస్ విజేతనని చెప్పుకోవడం మానేసి సీరియళ్లతో కెరీర్ ను కొనసాగిస్తున్నానని విజె సన్నీ అన్నారు. ప్రస్తుతం సినిమాలు, సీరియళ్లు చేశానని తాను చెబుతున్నానని సన్నీ వెల్లడించారు. బిగ్ బాస్ షో కొంతమంది కెరీర్ కు ప్లస్ అయినా మరి కొందరి కెరీర్ కు మైనస్ అయిందనే సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో వల్ల కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఆర్థికంగా స్థిరపడ్డారు.

బిగ్ బాస్ షో గురించి ఆ షోకు విన్నర్లుగా నిలిచిన సెలబ్రిటీలు ఈ తరహా కామెంట్లు చేయడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ షో సీజన్ 6కు ఎవరు విన్నర్ గా నిలుస్తారనే చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ షో విజేతల కెరీర్ కు ఎందుకు ప్లస్ కావడం లేదనే చర్చ అభిమానుల మధ్య జరుగుతోంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus