VTV Ganesh: నేను అనిల్ రావిపూడి చేతిలో పోయేవాడిని : వి.టి.వి గణేష్!

వెంకటేష్ (Venkatesh)  – అనిల్ రావిపూడి (Anil Ravipudi)  కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ నిన్న సారథి స్టూడియోస్ లో జరిగింది. 2025 జనవరి 14న ఈ సినిమా విడుదల కాబోతుంది అని ప్రకటించారు. అలాగే ఈ సినిమాలోని పాత్రలని కూడా పరిచయం చేశారు. ఈ క్రమంలో వి.టి.వి గణేష్ (VTV Ganesh), దర్శకుడు అనిల్ రావిపూడి..లు షూటింగ్లో జరిగిన ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. వి.టి.వి గణేష్ మాట్లాడుతూ..’ నేను ఈ సినిమాలో పార్టీ ప్రెసిడెంట్ గా కనిపించబోతున్నాను.

VTV Ganesh

ప్రభాస్  (Prabhas)  , మారుతి (Maruthi Dasari)  సినిమా షూటింగ్లో ఉండగా నాకు ఈ సినిమా గురించి ఫోన్ వచ్చింది. అనిల్ రావిపూడి సినిమా కోసం వెళ్తున్నాను అని ప్రభాస్ గారికి చెప్పి వచ్చాను. ఆయన ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari)  సినిమాలో కూడా నేను యాక్ట్ చేశాను. అది మంచి మాస్ హిట్ అయ్యింది. నేను అనిల్ రావిపూడి గారితో షూటింగ్ స్పాట్లో బాగా ఎంజాయ్ చేశాను.’ అంటూ చెప్పుకొచ్చాడు.

తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి మైకు లాక్కుని ‘ ‘సంక్రాంతికి వస్తున్నాం’ షూటింగ్ స్పాట్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. వి.టి సార్ ని (VTV Ganesh) నేను ‘మీరు నిజం గన్ ఎప్పుడైనా చూశారా?’ అని అడిగాను. ఇంతలో నరేష్ (Naresh) గారు తన సూట్ కేస్ లో ఉన్న ఒక గన్ తెప్పించారు. అది ఒరిజినల్ లైసెన్స్ గన్. కానీ మాకు అది ఒరిజినల్ అని తెలీదు. దీంతో నేను వి.టి సార్ వైపు పెట్టాను. వెంటనే నరేష్ గారు వెనక్కి లాగి.. గన్ బుల్లెట్ మ్యాగ్జైన్ తీసి చూపించారు.

అవి ఒరిజినల్ బుల్లెట్లు, అది ఒరిజినల్ గన్ అని అప్పుడు తెలిసింది. జస్ట్ అలా వేలు పెడితే బుల్లెట్ దూసుకెళ్తుంది. వి.టి సార్ చాలా అదృష్టవంతులు,మీకు చాలా లైఫ్ ఉంది అని చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. ఆ తర్వాత వి.టి.వి గణేష్.. ‘లైఫ్ సంగతి ఎలా ఉన్నా..! నేను పోయేవాడిని. నరేష్ గారు, అనిల్ రావిపూడి గారు ఎ1 ముద్దాయిలుగా జైల్లో ఉండేవారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంద్రగంటి మార్క్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus