మెగాహీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు యాక్సిడెంట్ వెనుక అసలు కారణాలు ఏంటనే విషయంలో.. పోలీసులు ప్రాథమికంగా అతి వేగం అని నిర్ధారించారు. అయితే ప్రమాదం జరిగిన స్థలంలో రోడ్డుపై ఇసుక నిలిచినట్లు కూడా గుర్తించారు. ఇసుక కారణంగా సాయి ధరమ్ తేజ్ బైక్ బ్యాలెన్స్ చేయలేకపోయాడనేది నిపుణుల వాదన. అయితే దీనికి భిన్నమైన మరో వెర్షన్ ను చెప్పుకొచ్చారు దర్శకుడు వివి.వినాయక్. వినాయక్ చెప్తున్న దానిప్రకారం.. సాయి ధరమ్ తేజ్ కొంతకాలంగా డైటింగ్ లో ఉన్నారు.
ఫిట్ నెస్ కోసం ఆయన ప్రత్యేకమైన నియమాలు పాటిస్తున్నారట. దాంతో.. వీక్ అయి కళ్లు తిరిగి పడి ఉంటారని వినాయక్ చెబుతున్నారు. సాయి తేజ్ ర్యాష్ డ్రైవింగ్ చేసే వ్యక్తి కాదని.. అలానే రోడ్డుపై ఉన్న ఇసుక కూడా పెద్ద ప్రమాదకారమైనది కాదని వినాయక్ అంటున్నారు. ఆ సమయంలో నీరసంతో వల్ల కళ్లు తిరిగి పడిపోయాడనేది వినాయక్ మాట. మీడియా దీన్ని పెద్ద రాద్ధాంతం చేయొద్దని కోరుతున్నారు వినాయక్. ఇదిలా ఉండగా..
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మెల్లగా కోలుకుంటున్నాడు. ఇప్పటికే కాలర్ బోన్ సర్జరీ విజయవంతగా జరిగింది. అయితే ఆయన పూర్తిగా కోలుకోవడానికి మాత్రం చాలా సమయం పడుతుందట. ఇప్పటికీ ఆయన్ని ఐసీయూలోనే ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.