Bellamkonda Srinivas: బెల్లంకొండ సినిమా పై కొత్త కన్ఫ్యూజన్…!

రాక్షసుడు వంటి రీమేక్ చిత్రంతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ .. ఆ తర్వాత అల్లుడు అదుర్స్ అనే నాసిరకం సినిమా చేసి విమర్శలపాలయ్యాడు. దీంతో తప్పు తెలుసుకుని ఇప్పుడు మళ్లీ ఓ మంచి రీమేక్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. అదే కర్ణన్. ఇటీవల తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. నిజానికి ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్ చెయ్యాలని ఆ చిత్రం దర్శకనిర్మాతలు భావించారు.

కానీ ఇక్కడ నుండీ రీమేక్ ఆఫర్ రావడంతో లైట్ తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ అసురన్ ను తెలుగులో రీమేక్ చేస్తున్న శ్రీకాంత్ అడ్డాలనే.. కర్ణన్ ను కూడా తెలుగులోకి రీమేక్ చేయబోతున్నట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ వినాయక్ కు వెళ్లినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ ని కూడా వినాయక్ దర్శకత్వం వహించబోతున్నారు అని గతంలో ప్రకటించారు.

కానీ ఆ రీమేక్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.దాంతో అతని డైరెక్షన్లో నే కర్ణన్ రీమేక్ కూడా చేస్తే కరెక్ట్ అని బెల్లంకొండ సురేష్ అండ్ టీమ్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన వస్తేనే కానీ కచ్చితంగా చెప్పలేము.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus