Waltair Veerayya: సంక్రాంతి సినిమా గురించి క్లియర్‌ రిపోర్ట్‌ ఇచ్చేసిన స్టార్‌ హీరో!

సినిమా రివ్యూలు మీరు చాలా చదివే ఉంటారు. అందులో ఆఖరున పంచ్‌లైన్‌లు రాస్తూ ఉంటారు. సినిమా గురించి రెండు ముక్కల్లో చెప్పేలా ఉంటాయి అవి. ఇప్పుడు అలాంటి పంచ్‌లైన్‌తోనే సినిమా రివ్యూ చెప్పేశారు మెగాస్టార్‌ చిరంజీవి. ఏ సినిమా గురించి అనుకుంటున్నారా? ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా గురించే. అదేనండీ ‘వాల్తేరు వీరయ్య’ గురించి. ఈ సినిమా పార్టీ ప్రెస్‌మీట్‌ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. అందులోనే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు.

సినిమా గురించి ఎక్కువగా మాట్లాడను అంటూనే సుమారు 15 నిమిషాలు మాట్లాడేశారు చిరంజీవి ఆ ప్రెస్‌మీట్‌లో. (మరి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఏం మాట్లాడుతారో తెలియదు అనుకోండి). ఆయన సినిమా గురించి చెబుతూ, చెబుతూ రివ్యూ స్టైల్‌లో సినిమా ఎలా ఉంటుంది, ఏం ఉండబోతోంది అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుండి ఇప్పటివరకూ బయటికి వచ్చిన ప్రమోషనల్ స్టప్ అంతా మాస్‌తో నిండిపోయింది. కానీ ‘వీరయ్య’లో మాస్‌ యాంగిల్‌ మాత్రమే కాదు ఎమోషనల్ యాంగిల్ కూడా ఉందట.

రవితేజ పాత్ర రూపంలో ఎమోషన్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఉంటుందని వార్తలొచ్చాయి. ఇప్పుడు చిరంజీవి కూడా అదే మాట చెప్పారు. ‘వాల్తేరు వీరయ్య’ రొటీన్ యాక్షన్ ఎంటర్టైనరే… కానీ సినిమాలో అదిరే ఎలిమెంట్ ఉంది. ‘‘ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను. చాలా గొప్పగా చూపించాడు బాబీ. ‘..వీరయ్య’ గొప్ప ఎమోషనల్ జర్నీ. ఇందులో కొన్ని ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి” అని చెప్పుకొచ్చారు చిరు.

‘‘ఇంట్లో అమ్మ రోజూ వంట చేస్తుంది. అది రొటీనే కానీ అందులోనూ ఏదో ఒక స్పెషల్ కచ్చితంగా ఉంటుంది. అలాంటిదే ‘వాల్తేరు వీరయ్య’ అని తన ఫస్ట్‌ రివ్యూ ఇచ్చేశారు చిరంజీవి. ఆ సంగతేంటో తెలియాలంటే జనవరి 13 వరకు ఆగాల్సిందే. హిందీలో ‘వీరయ్య’ను చూడాలని అనుకుంటే ఆ రోజే ఆ వెర్షన్‌ కూడా రిలీజ్‌ చేస్తున్నారు. సో.. ‘వీరయ్య’ వంటకంలో స్పెషల్‌ ఎలిమెంట్ ఏంటో ఆ రోజు తెలుస్తుంది అన్నమాట.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus