Waltair Veerayya: మళ్ళీ రిలీజ్ డేట్ ల క్లాషా.. అసలు మేటర్ ఏంటి?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవి శంకర్, నవీన్ ఎర్నేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. 2023 సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జనవరి 13 న ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు ఈ మధ్యనే అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.

అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ మారనుంది అని ఇన్సైడ్ టాక్. ఒకవేళ మారిస్తే కనుక రెండు రోజుల ముందు అంటే జనవరి 11 న ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఎందుకంటే జనవరి 12 న వీరసింహారెడ్డి రిలీజ్ కాబోతుంది.ఇది కూడా పెద్ద సినిమానే.. మైత్రి వారే ఆ చిత్రాన్ని కూడా నిర్మించారు. కాబట్టి..వాల్తేరు వీరయ్య కనుక జనవరి 13 న రిలీజ్ అయితే … వీరసింహారెడ్డి వల్ల ధియేటర్లు తక్కువయ్యి .. ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది.

చిరు సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అలాంటప్పుడు ఆ సినిమాకి ఎక్కువ ధియేటర్లు ఉండాలని నిర్మాతలు తాపత్రయం.బాలయ్య సినిమాకి చిరు సినిమా రేంజ్ లో ధియేటర్లు అవసరం లేదు. కానీ బాలయ్య సినిమాకి హిట్ టాక్ కనుక వస్తే.. కలెక్షన్లు భారీగానే వస్తాయి. ఇక ఈ రెండు సినిమాల టీజర్ లకి మంచి రెస్పాన్స్ లభించింది.

పాటలు కూడా ఓకె అనిపించాయి. మరి 2023 సంక్రాంతికి ఈ రెండు సినిమాల్లో ఏది విన్నర్ గా నిలుస్తుంది అన్న విషయం పై మొన్నటి వరకు చర్చ జరిగితే..ఇప్పుడు రిలీజ్ డేట్ ల విషయంలో మళ్లీ లొల్లి జరిగే ప్రమాదం ఉందా? అనే అంశం పై కూడా చర్చ మొదలైంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus