Waltair Veerayya: ఆ ఫోన్ నెంబర్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను… రెమో కామెంట్స్ వైరల్!

సాధారణ సినిమాలలో హీరోలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో విలన్లకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ప్రేక్షకులను మెప్పించడం కోసం విలన్లు కూడా హీరోలకు మించి కష్టపడతారనే విషయం మనకు తెలిసిందే.ఇలా విలన్ పాత్రలలో నటించే వారికి కూడా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉందని చెప్పాలి. విలన్ గా సుమారు వందకు పైగా సినిమాలలో నటించి మెప్పించిన నటుడు రేమో అలియాస్ రహీం గురించి అందరికీ సుపరిచితమే. ఈయన ఇప్పటివరకు సుమారు 100 సినిమాలకు పైగా అగ్ర హీరోలందరి సినిమాలలో విలన్ పాత్రలలో నటించి మెప్పించారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఈయన విలన్ గా నటించారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రహీం తన కెరియర్ గురించి కొన్ని విషయాలను తెలియజేశారు. చిన్నప్పటినుంచి సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది అయితే రవితేజ హీరోగా నటిస్తున్న వెంకీ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా అలాగే నిలుచున్నాను. నన్ను చూసిన రవితేజ టెర్రరిస్టా? అలా చూస్తున్నావు అని అడిగారు సినిమాలలో నటించాలని ఉందని చెప్పాను.

సినిమాలలో నటించాలంటే నటన రావాలి బాడీ కూడా ఫిట్ గా ఉండాలి అని చెప్పారు. ఆ మాట చెప్పడంతో ఏడుస్తూ వెళ్లాను. అయితే రవితేజ గారు పిలిచి తన ఫోన్ నెంబర్ ఇచ్చి బాగా బాడీ ఫిట్ నెస్ మెయింటైన్ చేసిన తర్వాత ఈ నెంబర్ కి ఫోన్ చేయని చెప్పారు. అలా ఆ ఫోన్ నెంబర్ వల్లే నేను ఇండస్ట్రీలో నేడు ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు.ఇప్పటికే ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు అందరి సినిమాలలో నటించాను.

మొదటిసారి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. అయితే ఈ సినిమాలో అవకాశం వచ్చిందన్న ఆనందం ఒకవైపు మరొక విషాద ఘటన కూడా అదే రోజు చోటుచేసుకుందని తెలిపారు. అప్పటికే తన భార్య కుమారుడు ఆరోగ్యం బాగాలేదు కొడుకుని ఐసీయూలో చేర్పించాను అదే రోజు షూటింగ్ కు రమ్మని పిలిచారు.షూటింగ్ వెళ్లి డైలాగ్స్ చెబుతున్నాను అప్పుడే ఇంటి నుంచి నా కుమారుడు చనిపోయాడని ఫోన్ వచ్చింది.

అక్కడి నుంచి వెళ్తే తిరిగి అవకాశం ఉంటుందో లేదో తెలియదు. అలాగే సాయంత్రం ఐదు గంటల వరకు షూటింగ్లో పాల్గొని అప్పుడు ఇంటికి వెళ్లానని ఈయన తన కొడుకు మరణం గురించి గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus